న్యూఢిల్లీ: భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారం దక్కింది. ప్రణబ్ ముఖర్జీతో పాటు నానాజీ దేశ్ ముఖ్,  డాక్టర్ భూపేన్ హాజారికాలకు కూడ భారతరత్నలను  ఇవ్వనున్నట్టు కేంద్రం ప్రకటించింది.

నానాజీ దేశ్‌ముఖ్‌లు, హాజారికాలు మరణించిన తర్వాత భారతరత్న పురస్కారం దక్కింది. కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘ కాలం పాటు  ప్రణబ్ ముఖర్జీ పనిచేశారు.కాంగ్రెస్ పార్టీలో సంక్షోభాల్లో  ఉన్న సమయాల్లో ఆయన కీలకపాత్ర పోషించారు. అయితే యూపీఏ  కేంద్రంలో  అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రపతి పదవిని ప్రణబ్  చేపట్టారు. రాష్ట్రపతి పదవి నుండి వైదొలిగిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ గత ఏడాది ఆర్ఎస్ఎస్ నిర్వహించిన  కార్యక్రమంలో కూడ పాల్గొన్నారు.

నానాజీ దేశ్ ముఖ్ 2010 ఫిబ్రవరిలో మృతి చెందాడు. భూపేన్ హజారికా అస్సాం వాగ్గేయకారుడు. హజారికా రచించిన  పాటలు అన్ని భారతీయ భాషల్లో అనువదించారు. పద్మభూషణ్, పద్మ విభూషణ్, దాదాసాహేబ్ పాల్కే అవార్డులు ఆయనకు దక్కాయి. 2012లొ ఆయన మరణించిన తర్వాత పద్మ విభూషణ్ అవార్డు దక్కింది.