2019వ సంవత్సారానికి గాను భారతరత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీతో పాటు నానాజీ దేశ్‌ముఖ్, భూపేన్ హజారికాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారతరత్న అవార్డులను అందజేశారు
2019వ సంవత్సారానికి గాను భారతరత్న అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీతో పాటు నానాజీ దేశ్‌ముఖ్, భూపేన్ హజారికాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ భారతరత్న అవార్డులను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా కేంద్రమంత్రులు, రాజకీయ నేతలు హాజరయ్యారు. 1935లో జన్మించిన ప్రణబ్ ముఖర్జీ కరడుగట్టిన కాంగ్రెస్‌వాదిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ కేబినెట్‌లలో మంత్రిగా, 2012 నుంచి 2017 వరకు భారత రాష్ట్రపతిగా ఆయన దేశానికి సేవలందించారు.
ఇక అస్సాంకి చెందిన భూపేన్ హజారికా కవి, సంగీతకారుడు, గాయకుడు, జర్నలిస్ట్, దర్శకుడిగా సేవలందించారు. 2011 నవంబర్ 5న ఆయన కన్నుమూశారు. ఇక నానాజీ దేశ్‌ముఖ్ జనసంఘ్‌లో కీలకపాత్ర పోషించారు. 1999-2005 మధ్యకాలంలో రాజ్యసభ సభ్యునిగా పనిచేశారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 8, 2019, 6:21 PM IST