Asianet News TeluguAsianet News Telugu

భార‌త్ జోడో యాత్ర: రాజీవ్ గాంధీ మెమోరియల్ వ‌ద్ద రాహుల్ నివాళులు.. దేశ‌వ్యాప్త యాత్ర ప్రారంభం..

భారత్ జోడో యాత్ర: కాంగ్రెస్ దేశవ్యాప్త భారత్ జోడో యాత్రను అధికారికంగా ప్రారంభిస్తూ కాంగ్రెస్ నాయ‌కులు, వ‌య‌నాడ్ పార్ల‌మెంట్ స‌భ్యులు రాహుల్ గాంధీ కన్యాకుమారికి వెళ్లి ర్యాలీలో ప్రసంగించనున్నారు.
 

Bharat Jodo Yatra: Rahul visits Rajiv Gandhi Memorial
Author
First Published Sep 7, 2022, 9:44 AM IST

భారత్ జోడో యాత్ర: కేంద్రంలోని బీజేపీ స‌ర్కారు ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాలు, దేశంలో పెరుగుతున్న విభ‌జ‌న‌, నిరుద్యోగం, ద్ర‌వ్యోల్బ‌ణం, కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగం వంటి అంశాల‌ను ఎత్తి చూప‌డంతో  పాటు పార్టీకి పూర్వ‌వైభ‌వం తీసుకురావ‌డానికి కాగ్రెస్ పార్టీ భార‌త్ జోడో యాత్ర‌ను చేప‌ట్టింది. క‌న్యాకుమారి  నుంచి కాశ్మీర్ వ‌ర‌కు సాగ‌నున్న ఈ యాత్ర బుధ‌వారం నాడు ప్రారంభం కానుంది. భార‌త్ జోడో యాత్ర ప్రారంభానికి ముందు 1991 లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో మాజీ ప్రధాని ఆత్మాహుతి దాడిలో హత్యకు గురైన శ్రీపెరంబుదూర్‌లోని రాజీవ్ గాంధీ మెమోరియల్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన ప్రార్థనా సమావేశానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. స్మార‌కం వ‌ద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన తండ్రిని గుర్తు చేసుకుంటూ.. స్మారక చిహ్నం ముందు సుమారు 25 నిమిషాలు కూర్చున్నాడు. డీకే శివకుమార్‌తోపాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు ఆయన వెంట ఉన్నారు. దేశవ్యాప్త భారత్ జోడో యాత్రను అధికారికంగా ప్రారంభిస్తూ గాంధీ కన్యాకుమారికి వెళ్లి ర్యాలీలో ప్రసంగిస్తారు.

ధరల పెరుగుదల, నిరుద్యోగం, మత సామరస్యాన్ని పెంపొందించేందుకు సెప్టెంబర్ 7 నుండి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ 3,500 కిలో మీట‌ర్ల 'భారత్ జోడో యాత్ర' బుధ‌వారం ప్రారంభించ‌నుంది. తమ కార్యకర్తలు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఈ సమస్యలను లేవనెత్తడం కొనసాగిస్తారని, సాధారణ ప్రజల ప్రయోజనం కోసం పోరాడటానికి వీధుల్లోకి వస్తారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ మాట్లాడుతూ ఇది "నిశ్శబ్ద ప్రతిబింబం.. నూతన సంకల్పం కోసం ఒక ప్ర‌త్యేక‌మైన రోజు అనీ, ఇది భారత రాజకీయాల్లో ఒక మలుపు" అని అన్నారు. "7 సెప్టెంబర్ 2022.. భారతదేశంలోని పురాతన రాజకీయ పార్టీ ఇప్పటివరకు చేపట్టిన అత్యంత సుదీర్ఘమైన పాదయాత్రను ప్రారంభించే రోజు. ఇది నిశ్శబ్ధమైన ప్రతిబింబం.. నూతన సంకల్పం కోసం ఒక రోజు. ఇది భారత రాజకీయాల్లో కీలక మలుపు. ఇది కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది' అని పార్టీ కమ్యూనికేషన్స్ ఇన్‌ఛార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ట్వీట్ చేశారు.

కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవావ్ ఖేరా స్పందిస్తూ..  “ఈ రోజు మనస్సు ఉప్పొంగిపోయింది. చరిత్రలోని ఒక ముఖ్యమైన అధ్యాయంలో ఒక చిన్న భాగం కావడం నాకు దక్కిన ప్రత్యేకత. కలిసి భారతదేశాన్ని చేర్చుదాం.. అంటూ పేర్కొన్నారు. కాగా, ఈ యాత్ర సంద‌ర్భంగా రాహుల్ గాంధీ ఏ హోట‌ల్ లోనూ ఉండ‌ర‌నీ, స్లీపింగ్ బెడ్‌లు, టాయిలెట్ తో అమర్చిన కంటైనర్‌లలో ఉంటార‌ని సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. “ఇలాంటి దాదాపు 60 కంటైనర్‌లను సిద్ధం చేసి కన్యాకుమారికి పంపారు. అక్కడ ఈ కంటైనర్‌లన్నీ ఉంచబడ్డాయి. అక్కడ ఒక గ్రామాన్ని ఏర్పాటు చేశారు. కంటైనర్‌ను రాత్రి విశ్రాంతి కోసం ప్రతిరోజూ గ్రామం ఆకారంలో కొత్త ప్రదేశంలో పార్క్ చేస్తారు. రాహుల్ గాంధీతో కలిసి ఉండే సమయ యాత్రికులంద‌రూ కలిసి భోజనం చేస్తారు.. ఆయ‌న‌తో  సన్నిహితంగా ఉంటారు" అని కాంగ్రెస్ వర్గాలను ఉటంకిస్తూ ఏఎన్ఐ పేర్కొంది.

దేశవ్యాప్త యాత్రకు ముందు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాధ్రా, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి ప్రజా ప్రాముఖ్యత ఉన్న ఇతర సమస్యలపై ప్రజలు ఐక్యంగా ఉంటారని నొక్కి చెప్పారు.

అందరం కలిసి భారతదేశాన్ని ఏకం చేద్దాం. ప్రజా సమస్యలను పరిష్కరించుకుందాం.. మేము  ప్రజా గొంతుకలను వినాలనుకుంటున్నాం..: ప్రియాంక గాంధీ

 

Follow Us:
Download App:
  • android
  • ios