కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీవో అనుమతి లభించింది. ఇందుకు సంబంధించి ప్రత్యేక నిపుణుల బృందం సిఫారసు చేసింది. శుక్రవారం కోవిషీల్డ్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీవో సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. కోవాగ్జిన్‌ను హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసింది.