ప్రియాంక పొలిటికల్ ఎంట్రీపై భర్త వాద్రా ఎమోషనల్

https://static.asianetnews.com/images/authors/4dc3319f-b603-5b5b-b2b3-3421e0f11ce6.jpg
First Published 11, Feb 2019, 3:56 PM IST
Best wishes, P: Robert Vadra puts up emotional post on wife Priyanka's Lucknow rally
Highlights

తన భార్య ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో ఆమె భర్త రాబర్ట్ వాద్రా ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో  ప్రియాంకకు బెస్ట్ విషెస్ అంటూ పోస్ట్ చేశారు. 
 


లక్నో:  తన భార్య ప్రియాంక ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడంతో ఆమె భర్త రాబర్ట్ వాద్రా ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో  ప్రియాంకకు బెస్ట్ విషెస్ అంటూ పోస్ట్ చేశారు. 

కాంగ్రెస్ పార్టీ  ఉత్తర్ ప్రదేశ్(తూర్పు)  వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా  రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ సోమవారం నాడు  యూపీలో పర్యటించారు.

ప్రియాంకను పరిపూర్ణ మహిళ అంటూ ప్రశంసించారు.   తనకు మంచి స్నేహితురాలే కాదు, పర్‌ఫెక్ట్ వైఫ్... మా పిల్లలకు బెస్ట్ మదర్ అంటూ ఆయన పోస్ట్ చేశారు.  ప్రియాంక గాంధీ 1997లో రాబర్ట్ వాద్రాను పెళ్లి చేసుకొన్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు.

యూపీఏ ప్రభుత్వ హాయంలో  రాబర్ట్ వాద్రాకు చెందిన కంపెనీలు ప్రయోజనం పొందాయనే ఆరోపణలు వచ్చాయి.  బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విషయమై విచారణ ప్రారంభమైన విషయం తెలిసిందే. 

యూపీ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో  ప్రియాంకకు బాధ్యతలను ఇచ్చారు. అతి పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రియాంకను బరిలోకి దింపింది.

ప్రియాంక గతంలో ఆమేథీ, రాయ్‌బరేలీ పార్లమెంట్ నియోజకవర్గాల ప్రచారానికి మాత్రమే పరిమితమైంది. కానీ  ఈ దఫా మాత్రం యూపిలోని  కీలకమైన పార్లమెంట్ నియోజకవర్గాల్లో  ప్రియాంక ఇంచార్జీగా బాధ్యతలు తీసుకొన్నారు.

 

 

 

loader