కుటుంబ కలహాలకు చెక్ పెట్టాలని, భర్తకు పాఠం చెప్పాలని ఓ మహిళ చోరీ ప్లాన్ వేసింది. తన స్కూటర్ చోరీకి గురైనట్టు భర్తకు చెప్పింది. కానీ, పోలీసు కేసు పెట్టాలని ఒత్తిడి చేయడంతో కథ అడ్డం తిరగింది.
బెంగళూరు: కుటుంబ కలహాలకు చెక్ పెట్టాలని ఓ మహిళ చోరీ ప్లాన్ వేసింది. తన స్కూటర్, 11 తులాల బంగారం కూడా అందులోనే ఉండిపోయిందనే తన భర్తను నమ్మించి.. కుటుంబాన్ని అంతా ఏకం చేయాలని స్కెచ్ వేసింది. కానీ, పోలీసు కేసు పెట్టాలని భర్త ఒత్తిడి చేయడంతో ఆ ప్లాన్ నీరుగారిపోయింది. పోలీసులకు అసలు విషయం తెలిసింది. కానీ, ఆ మహిళను అరెస్టు చేయలేదు.
భర్త ఒత్తిడితో ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మల్లేశ్వరం 13వ క్రాస్ వద్ద తన స్కూటర్ చోరీకి గురైనట్టు తెలిపింది. సీసీటీవీ ఫుటేజీ సహకారంతో చోరీ చేసిన ఇద్దరు వ్యక్తులు.. ఫిర్యాదు చేసిన మహిళ మిత్రులు ధనంజయ్, రాకేశ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు వారిని విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ మహిళ తన భర్తకు గుణపాఠం చెప్పాలని ఈ చోరీ స్కెచ్ వేసిందని, తమ సహాయం కోరిందని వారిద్దరూ పోలీసులకు తెలిపారు. ఆ మహిళ బ్యాంక్ లాకర్ నుంచి 109 గ్రాముల బంగారం స్కూటీలో పెట్టుకుని పిల్లలను ట్యూషన్ కోసం దించి వచ్చి బంధువుల ఇంటికి వెళ్లింది. ఆ తర్వాత పిల్లలను ట్యూషన్ నుంచి తీసుకెళ్లడానికి వెళ్లింది. స్కూటీ పార్క్ చేసి కావాలనే తాళం చెవి దానికే వదిలి ఆ స్కూటీని ఎత్తుకెళ్లాలని మిత్రులకు చెప్పింది.
Also Read: Protocol row: నాకు స్వాగతం పలకడానికి రావొద్దు: కర్ణాటక సీఎంకు ప్రధాని మోడీ విజ్ఞప్తి
ఆ తర్వాత తన స్కూటీ చోరీకి గురైందని, అందులో బంగారం కూడా ఉన్నదని భర్తకు కట్టుకథ చెప్పింది. అయితే.. పోలీసు ఫిర్యాదు చేయాలని భర్త పట్టుబట్టడంతో కథ అడ్డం తిరిగింది.
చోరీ చేసిన ఇద్దరు. ప్లాన్ వేసిన ఆ మహిళను పోలీసులు అరెస్టు చేయలేదు.
