సారాంశం
బెంగళూరులో ఓ యువతి తన లవర్ వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడని సలసల కాగిన వేడి నీటిని మీద పోసింది. ఇంటి తలుపులు వేసి పారిపోయింది. 50 శాతం కాలిన హాస్పిటల్‌లో చేరారు. పోలీసులు కేసు నమోదు చేసిన నిందితురాలి కోసం గాలిస్తున్నారు.
బెంగళూరు: కర్ణాటకలో షాకింగ్ ఘనట చోటుచేసుకుంది. ఒకే పట్టణంలో ఉన్న వారిద్దరి మధ్య ఐదేళ్ల క్రితం పరిచయం జరిగింది. ఆ తర్వాత ప్రేమ చిగురించింది. కానీ, కొన్నాళ్లకు ఆమెకు అది వరకే పెళ్లైపోయిందని, కానీ, ఆ విషయం తన వద్ద దాచిందని ఆ అబ్బాయి తెలుసుకున్నాడు. దాంతో కొంత డిస్టెన్స్ మెయింటెయిన్ చేశాడు. ఆ తర్వాత వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇక తమ మధ్య సంబంధాన్ని నిలిపేయాలని ఆ అబ్బాయి ఆమెకు చెప్పాడు. ఆగ్రహంతో అతనిపై సలసల కాగే వేడి నీటిని పోసింది. బీర్ బాటిల్ చేతబట్టి బెదిరించి ఇంట్లోనే బంధించి ఆమె పారిపోయింది. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఆ వ్యక్తికి 50 శాతం కాలిన గాయాలు అయ్యాయని విక్టోరియా హాస్పిటల్ వైద్యులు తెలిపారు. ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.
కాలబురగి జిల్లాకు చెందిన జ్యోతి దొడ్డమని, 30 ఏళ్ల విజయ్ కుమార్‌ల మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఒకే పట్టణంలో ఉండటంతో వీరి మధ్య ఐదేళ్ల క్రితం పరిచయమైంది. ఎండీ బ్లాక్ చామరాజ్‌పేట్‌లో ఉ్న జ్యోతి హనుమంత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నర్సుగా చేస్తున్నారు. చామమరాజ్‌పేట్‌లోని ఓ క్లాథింగ్ కంపెనీలో విజయ్ కుమార్ ఫొటో ఎడిటర్‌గా పని చేస్తున్నారు.
రెండేళ్ల క్రితం జ్యోతికి అప్పటికే పెళ్లయిపోయిందని విజయ్ కుమార్‌కు తెలిసింది. విజయ్ కుమార్ డిస్టెన్స్ మెయింటెయిన్ చేయగా.. జ్యోతి మాత్రం తమ సంబంధాన్ని కొనసాగించాలని ఒత్తిడి చేసింది. ఏడు నెలల క్రితం విజయ్ ఎండీ బ్లాక్‌కు మారారు. బెంగళూరులో జ్యోతి ఆయన వద్దకు వెళ్లగా ఆయన యరండహల్లిలోని ఫ్రెండ్ ఇంటికి మారాడు. అప్పుడప్పుడు జ్యోతి వద్దకు వచ్చి వెళ్లుతుండేవాడు.
Also Read: మా పతకాలు గంగలో వేస్తాం.. ఇండియా గేట్ వద్ద నిరాహార దీక్షకు దిగుతాం: రెజ్లర్లు
ఆమెకు పెళ్లైపోయిందని తెలిసిన తర్వాత ఇక తమ మధ్య సంబంధం ఎంతో కాలం కొనసాగదని తెలుసుకున్నానని, అందుకే ఆ రిలేషన్ క్లోజ్ చేసుకోవాలని ఆమెకు చెప్పినట్టు విజయ్ పోలీసులకు వివరించాడు. మే 11వ తేదీన విజయ్ పెళ్లి చేసుకున్నాడు. మే 23వ తేదీన మళ్లీ సిటీకి తిరిగి వచ్చాడు.
మే 25వ తేదీన జ్యోతి విజయ్‌కు కాల్ చేసి తన బర్త్ డే ప్రిపేరేషన్ కోసం ఇంటికి రమ్మంది. తన భార్య, తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడిన తర్వాత విజయ్ జ్యోతితో మాట్లాడాడు. ఇప్పుడు ఇద్దరమూ పెళ్లి చేసుకున్నవారమని, కాబట్టి, కేవలం మిత్రులుగానే ఉండిపోదామని చెప్పాడు.
అదే రోజు రాత్రి సెలైన్ బాటిల్ తనకు పెట్టాలని జ్యోతిని విజయ్ కోరాడు. ఆ తర్వాత ఇద్దరూ నిద్రలోకి జారుకున్నారు. మే 26వ తేదీ తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో విజయ్ గాఢ నిద్రలో ఉండగానే జ్యోతి మరిగిన నీటిని ఆయనపై పోసింది. అదే గందరగోళంలో విజయ్ ఎల్పీజీ సిలిండర్ వద్దకు వెళ్లాడు. తలకు గాయమైంది. బీర్ బాటిల్ చేతిలోకి తీసుకుని జ్యోతి విజయ్‌ను బెదిరించింది. ఇంటి డోర్ వేసి పారిపోయింది.
విజయ్ అరుపులతో ఇంటి యజమాని అక్కడికి వచ్చి వెంటనే విక్టోరియా హాస్పిటల్‌కు తరలించాడు. పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసి జ్యోతి కోసం వెతుకుతున్నారు.