Asianet News TeluguAsianet News Telugu

రూ.250 భోజనం ఆర్డర్‌.. ఒక్క లింక్‌తో రూ. 50 వేలు మాయం..

ఇదో కొత్తరకం సైబర్ క్రైం. ఫేస్ బుక్ వేదికగా అక్షరాలా రూ. 50 వేలు పోగొట్టుకున్న ఘటన కర్ణాటకలో మంగళవారం జరిగింది. కర్ణాటకలోని కనకపుర రోడ్డు యలచేనహళ్లి నివాసి సవితాశర్మా మంగళవారం ఫేస్‌బుక్‌లో రూ.250 విలువ చేసే ఒక దాలి ఆర్డర్‌ చేస్తే రెండు దాలి ఉచితంగా ఇస్తామని ప్రకటన గమనించింది. 

Bengaluru woman loses Rs 50,000 over Rs 250 meal offer on Facebook - bsb
Author
Hyderabad, First Published Dec 28, 2020, 10:30 AM IST

ఇదో కొత్తరకం సైబర్ క్రైం. ఫేస్ బుక్ వేదికగా అక్షరాలా రూ. 50 వేలు పోగొట్టుకున్న ఘటన కర్ణాటకలో మంగళవారం జరిగింది. కర్ణాటకలోని కనకపుర రోడ్డు యలచేనహళ్లి నివాసి సవితాశర్మా మంగళవారం ఫేస్‌బుక్‌లో రూ.250 విలువ చేసే ఒక దాలి ఆర్డర్‌ చేస్తే రెండు దాలి ఉచితంగా ఇస్తామని ప్రకటన గమనించింది. 

భోజనం ఆర్డర్‌ చేయడానికి ప్రకటనలో ఇచ్చిన నెంబరుకు ఫోన్‌ ‌చేసింది. ఈ క్రమంలో ఆర్డర్‌ చేయడానికి ముందు రూ.10 చెల్లించాలని, అనంతరం భోజనం ఇంటికి సరఫరా చేసిన అనంతరం మిగిలిన నగదు చెల్లించవచ్చునని అవతలి వ్యక్తి తెలిపాడు. అంతేకాదు దీనికోసం ఓ ఫాం నింపాలని సవితాశర్మా మొబైల్‌కు లింక్‌ పంపించాడు.

ఈ ఫాంలో ఆమె డెబిట్‌కార్డు వివరాలు, పిన్‌ నెంబరును నమోదుచేసింది. వెంటనే కొద్దిక్షణాల్లో రూ.49,996 నగదు ఆమె బ్యాంక్‌ అకౌంట్‌ నుంచి డెబిట్‌ అయినట్లు సవితాశర్మా మొబైల్‌కు మెసేజ్‌ వచ్చింది. దీంతో గాబరాబడిన బాధితురాలు అదే నెంబర్‌కు ఫోన్‌ చేయగా స్విచ్చాఫ్‌‌ అయినట్లు తెలిసింది. దీంతో తాను మోసపోయినట్టు తెలుసుకుంది. 

మరుసటిరోజు ఆమె సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఫేస్‌‌బుక్‌ ప్రకటన కలిగిన రెస్టారెంట్‌ అడ్రస్‌ సదాశివనగర అని తెలిసింది.  సాధ్యమైనంత త్వరగా నిందితుడి పట్టుకుంటామని  పోలీసులు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios