భర్తను  చంపేందుకు భార్య ప్లాన్ వేసింది. ఇందుకు రౌడీని పురమాయించి అతనికి సుపారీ కూడా ఇచ్చింది. అయితే... ఆ రౌడీ అతి తెలివి ప్రదర్శించాడు. ఈ విషయాన్ని ఆమె భర్తకు చెప్పి... అతని దగ్గర నుంచి డబ్బులు రాబట్టాలని అనుకున్నాడు. చివరకు పోలీసులకు తాను చిక్కాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... క్రిష్ణగిరి జిల్లా మత్తూరు అణ్ణానగర్‌కు చెందిన మాదేష్‌ (32). ఇతని భార్య (27). వీరికి  10 ఏళ్ల క్రితం పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలున్నారు. కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గలాటాలు జరుగుతున్నాయి. దీనితో భర్తను అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. అందుకు అత్తిపల్లంకు చెందిన ప్రముఖ రౌడీ విష్ణును సంప్రదించి రూ. 2 లక్షలకు కిరాయి కుదుర్చుకుని రూ. 30 వేలు అడ్వాన్స్‌ డబ్బులిచ్చింది. 

 రౌడీ విష్ణు మరో ప్లాన్ వేశాడు. ఆమె భర్త మాదేష్‌ను కలిసి నీ భార్య నిన్ను హత్య చేసేందుకు నాకు డబ్బులిచ్చింది, నాకు రూ. 3 లక్షలు ఇవ్వు. నిన్న హత్య చేసేందుకు యత్నిస్తాం, ఆ సమయంలో నీవు తప్పించుకొని వెళ్లిపో అని తెలిపాడు.  దీంతో జాగ్రత్తపడిన మాదేశ్‌ తన అనుచరులు 10 మందిని తీసుకొని వెళ్లి విష్ణును పట్టుకుని మత్తూరు పోలీసులకు అప్పగించాడు.  పోలీసులు విష్ణును అతన్ని అరెస్టు చేసి నిజంగానే భర్తను హత్య చేసేందుకు ఆమె డబ్బులిచ్చిందా, లేక మాదేష్‌ వద్ద డబ్బులు లాక్కొనేందుకు ఈ నాటకమాడారా అన్న విషయంపై విచారణ జరుపుతున్నారు.