Asianet News TeluguAsianet News Telugu

బెంగళూరు వాసులకు అలర్ట్ : ఈ ఏరియాలలో మూడు రోజుల పాటు పవర్ కట్స్ .. లిస్ట్ ఇదే

బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ (బెస్కామ్) , కర్నాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (కెపిటిసిఎల్)లు వరుస నిర్వహణ , మరమ్మత్తు ప్రాజెక్టులను ప్రారంభించినందున రాబోయే మూడు రోజులలో బెంగళూరు విద్యుత్ కోతలను ఎదుర్కోనుంది.

Bengaluru To Face Scheduled Power Cuts From Jan 23-25; Check List Of Affected Areas ksp
Author
First Published Jan 23, 2024, 6:19 PM IST | Last Updated Jan 23, 2024, 6:22 PM IST

బెంగళూరు ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ (బెస్కామ్) , కర్నాటక పవర్ ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (కెపిటిసిఎల్)లు వరుస నిర్వహణ , మరమ్మత్తు ప్రాజెక్టులను ప్రారంభించినందున రాబోయే మూడు రోజులలో బెంగళూరు విద్యుత్ కోతలను ఎదుర్కోనుంది. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, ఆధునీకీరణ, విద్యుత్ లైన్ల నిర్వహణ, ఓవర్‌హెడ్ కేబుల్‌లను భూగర్భంలోకి మార్చడం, స్తంభాలను మార్చడం , భూగర్భ కేబుల్ నష్టాన్ని సరిదిద్దడం వంటి అనేక రకాల కార్యకలాపాలను ఈ సంస్థలు కలిగి వుంటాయి. 

దీనికి అదనంగా చెట్ల కొట్టివేత, జలసిరి నీటి సరఫరా పనులు , ఇతర అనుబంధ పనులు కూడా ఎజెండాలో వున్నాయి. ఈ పనుల నేపథ్యంలో జనవరి 23 మంగళవారం నుంచి జనవరి 25 గురువారం వరకు బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాకు  అంతరాయం ఏర్పడే అవకాశం వుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ నిర్వహణ పనులు జరుగుతాయని అంచనా. 

జనవరి 23, మంగళవారం :

మాయసంద్ర, జడేయ, శెట్టిగౌడనహళ్లి, సిగ్గెహళ్లి, ఎట్టిఘల్లి, విజయపుర, జగమ్‌కొట్టే, దొడ్డబెళవంగళ, గుండమగెర్రె, సస్లు, ఈహెచ్‌టీ ఎయిర్, మంజునాథనగర్, శివనగర, ప్రకాష్ నగర, ఎల్ఎన్ పురా, సుబ్రహ్మణ్యనగర, రాజాజీనగర్ 2వ బ్లాక్, సుబ్రమణ్యనగర, రాజాజీనగర్ 6వ బ్లాక్ లేఅవుట్, హంపి నగర్, అగ్రహార, దాసరహలి, ఇందిరా నగారా, 12వ బ్లాక్, 7వ బ్లాక్, 11వ బ్లాక్, ఆర్జీఏ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ 1 & 2, 9వ A బ్లాక్, 9వ B బ్లాక్, ఇంటెల్, స్టేషన్ ఆక్సిలరీ.

జనవరి 24, బుధవారం :

మలేబెన్నూరు, హాలివాన, కుంబలూరు, బూదిహాల్, నందితవారే, కొక్కనూరు, గోవినహల్, కునెబెలకెరె, హిందుస్‌గట్ట, కుమారహనహళ్లి, గుడ్డదహళ్లి, దేవరబెలకెరె, మేళేకట్టె, జరికట్టి, ముదహదాడి, సాలకట్టి, కె. బేవినహల్లి, చాత్ గోడలెగుండల్లి మరియు చుట్టుపక్కల గ్రామాలు. బీడబ్ల్యూఎస్ఎస్‌బీ ఎస్‌‌టీపీ, జక్కసంద్ర, హెచ్ఎస్ఆర్ 5వ సెక్టార్, టీచర్స్ కాలనీ, వెంకటాపురలో కొంత భాగం, గ్రీనేజ్ అపార్ట్‌మెంట్, కోరమంగళ ఎక్స్‌టెన్షన్.

జనవరి 25, గురువారం :

దొడ్డబళ్లాపుర టౌన్, రాజ్‌గట్ట, తిప్పూరు, రఘునాథపుర, తలగవార, గండ్రాజపుర, కొనగట్ట, ముద్దనాయకనపాళ్య, హనబే, ఎస్‌ఎస్ ఘాటి, అంతరహళ్లి, కంటనకుంటె, నేరాలగట్ట, హడోనహళ్లి మరియు పరిసర ప్రాంతాలు, ఓబళాపుర, దొడ్డబళ్లి, మండెడ్కహల్లి, మన్నేడ్‌కహల్లి, మన్నేడ్‌కహళ్లి , మహిమాపుర , లక్కెనహళ్లి, మేలేకతిగనూరు, జి జి పాళ్య, కె అగ్రహార, ఆరెబొమ్మనహళ్లి, కొడగి బొమ్మనహళ్లి, లక్కసంద్ర, సుల్కుంటె, హల్కూరు, తిమ్మసంద్రలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగనుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios