రంగు లేడని, ఎత్తు సరిగా లేడని... బట్టతల అని ఇలా కారణాలు చూపి అబ్బాయిలను రిజెక్ట్ చేసిన అమ్మాయిలను చూసే ఉంటారు. అయితే... ఓ యువతి మాత్రం అబ్బాయి ముక్కు పొడుగ్గా ఉందని రిజెక్ట్ చేసింది... అది కూడా పెళ్లి నిశ్చయమై... మరి కొద్ది రోజుల్లో పెళ్లి అనగా ఆ కారణం చూపడం గమనార్హం. అయితే... ఆ యువతి పేల్చిన బాంబుకి.. వరుడు కూడా సరైన రీతిలో సమాధానం చెప్పాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

బార్‌లో పడ్డ దొంగలు.. ఎత్తుకెళ్ళింది ఏంటో తెలుసా?

పూర్తి వివరాల్లోకి వెళితే... కోరమంగలకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ జ్యోతి ప్రకాశ్ కు ఓ మ్యాట్రిమోనీ సైట్ ద్వారా హిమ బిందు అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొంతకాలం ఛాటింగ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఒకరి అభిప్రాయాలు..మరొకరికి నచ్చడంతో ప్రేమలో పడ్డారు. కొంత కాలం తర్వాత ఇరువురు ఈ విషయాన్ని తమ పెద్దలకు తెలియజేశారు.

వారి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకరించారు. గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నెల 30న వివాహానికి ముహూర్తం పెట్టుకున్నారు. పెళ్లికి లక్షలు ఖర్చు చేశారు. శుభలేఖలు కూడా పంచేశారు. ఇరు కుటుంబాల వారు పెళ్లి దుస్తులు కొనుగోలు చేస్తూ హడావిడిగా ఉన్నారు. ఇంతలో పెళ్లికుమార్తె బాంబు పేల్చింది. 

మంచి స్పీ డ్‌‌లో ఉండగా శృంగారాన్ని మధ్యలోనే అపేస్తున్న భర్త.. అది తట్టుకోలేని భార్య...

పెళ్లికొడుకు ముక్కు పొడవుగా ఉందని తనకు అతడి ముక్కు నచ్చట్లేదని చెప్పింది. ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవాలని, లేదంటే పెళ్లికి ఒప్పుకోనని తేల్చి చెప్పింది. ఇంత డబ్బు ఖర్చు చేసి పెళ్లి చేస్తుంటే ఇలా చేయడం సరికాదని ఆమెపై పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇన్ని రోజులు ఈ ముక్కు కనపడేలాదా అని ప్రశ్నిస్తున్నారు. కాగా... పెళ్లి కూతురు చేసిన పనికి వాళ్లు కామ్ గా కూర్చోలేదు. వధువు, ఆమె కుటుంబ సభ్యులపై పోలీసుకు ఫిర్యాదు చేశారు. అక్కడితో ఆగకుండా వరుడు కోర్టుకి కూడా ఎక్కడం విశేషం.