Asianet News TeluguAsianet News Telugu

స్నేహితులతో శారీరక సంబంధం పెట్టుకోవాలని భర్త బలవంతం చేశాడు.. వాటిని రికార్డు చేశాడు: మహిళా టెక్కీ ఫిర్యాదు..

కర్ణాటకలోని బెంగళూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే ఓ మహిళ టెక్కీని స్నేహితులతో పడుకోమని బలవంతం చేశాడు. స్నేహితులు ఆమెపై అత్యాచారం చేస్తున్న వీడియో తీశాడు.

Bengaluru Techie complaint on Husband forced me to sleep with friends recorded it
Author
First Published Dec 10, 2022, 10:51 AM IST

కర్ణాటకలోని బెంగళూరులో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కట్టుకున్న భర్తే ఓ మహిళ టెక్కీని స్నేహితులతో పడుకోమని బలవంతం చేశాడు. స్నేహితులు ఆమెపై అత్యాచారం చేస్తున్న వీడియో తీశాడు. ఆ వేధింపులు భరించలేక భర్తకు విడాకులు ఇచ్చేందుకు మహిళ సిద్దమవ్వగా.. అతడు ఆ వీడియోలతో ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే మహిళా పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. బాధితురాలు ఫిర్యాదు ప్రకారం.. సంపిగేహళ్లికి చెందిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు 2011లో వివాహం జరిగింది. ఆమె భర్త కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే. ఆ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. 

అయితే మహిళ భర్త ఆమెను తీవ్ర స్థాయిలో వేధింపులకు గురిచేసేవాడు. మద్యం, డ్రగ్స్‌కు బానిసైన అతడు.. ఆమెను ఇతర పురుషులతో శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేసేవాడు. ఇందుకు నిరాకరించడంతో ఆమెపై దాడికి దిగాడు. ఈ క్రమంలోనే మహిళ అతడి ఇద్దరు స్నేహితులతో శృంగారంలో పాల్గొనాల్సి వచ్చింది. అయితే దీనిని మహిళ భర్త వీడియో తీశాడు. ఈ క్రమంలోనే భర్త నుంచి వేధింపులు రోజురోజుకు ఎక్కువ కావడంతో.. ఆమె విడాకులు ఇవ్వాలని కోరింది. అయితే అతడు మాత్రం విడాకులు ఇవ్వనని.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. 

ఈ క్రమంలోనే  మహిళ సంపిగేహళ్లి పోలీసును ఆశ్రయించింది.  ‘‘తనతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని నా సోదరిని బలవంతం చేశాడు’’అని కూడా బాధిత మహిళ ఫిర్యాదులో పేర్కొంది. ‘‘నా భర్త మద్యం మత్తులో నన్ను కొట్టేవాడు. పరిస్థితి మరింత దిగజారడంతో నేను అతనికి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇది అతనికి కోపం తెప్పించింది. అతను ఇప్పుడు వీడియోలు, చిత్రాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరిస్తున్నా’’ అని ఆమె ఆరోపించారు.

తన భర్త గంజాయికి అలవాటు పడ్డాడని ఆమె చెప్పింది. తమ ఇంట్లోని పూల కుండీలో రెండు మొక్కలు పెంచాడని కూడా పేర్కొంది. ఈ క్రమంలోనే ఇంట్లోని మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios