బెంగళూరులో దారుణం జరిగింది.. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ప్రిన్సిపాల్‌ను కొందరు దుండగులు దారుణంగా నరికి చంపారు. 

బెంగళూరులో దారుణం జరిగింది.. తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్న ప్రిన్సిపాల్‌ను కొందరు దుండగులు దారుణంగా నరికి చంపారు. అగ్రహార దసహళ్లిలోని హవనూర్ పబ్లిక్ స్కూల్‌లో ప్రిన్సిపాల్ రంగనాథ్.. విద్యార్థులకు స్పెషల్ క్లాస్ చెబుతుండగా గుర్తు తెలియని ఆరుగురు దుండగులు మారణాయుధాలతో పాఠశాలలోకి ప్రవేశించి ఆయనను విచక్షణారహితంగా నరికారు. అనంతరం కారులో పరారయ్యారు.

పోలీసులకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితులను గుర్తించారు. వారి కోసం గాలిస్తుండగా మహాలక్ష్మీ లేఅవుట్ ప్రాంతంలో దుండగుడు ఉన్నట్లు సమాచారం అందింది.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులపై అతను కాల్పులు జరపడంతో.. పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరిపాడు.. ఈ క్రమంలో ఓ బుల్లెట్ నిందితుడి కాలులోకి దూసుకెళ్లడంతో అతను గాయపడ్డాడు..

వెంటనే అతన్ని పట్టుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. స్కూలు భవనం కట్టిన స్థల విషయంలో వివాదామే హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుబడిన దుండగుడి సాయంతో మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.