మానవ జీవితంలో  ప్రస్తుతం సెల్‌ఫోన్ అనేది నిత్యావసరంగా మారింది. పొద్దున లేచింది మొదలు.. నిద్రలోకి జారుకునే ముందు వరకు ఫోన్‌లు వాడుతూనే ఉంటున్నారు.

మానవ జీవితంలో ప్రస్తుతం సెల్‌ఫోన్ అనేది నిత్యావసరంగా మారింది. పొద్దున లేచింది మొదలు.. నిద్రలోకి జారుకునే ముందు వరకు ఫోన్‌లు వాడుతూనే ఉంటున్నారు. ఈ తరుణంలో తాజాగా ఓ సర్వేలో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. ఆ సర్వే ప్రకారం.. చాలా మంది బెంగళూరు వాసులకు మొబైల్ ఫోన్‌లతో బంధం విడదీయరానిదిగా మారింది. 91 శాతం మంది నిద్రపోయే ముందు బెడ్‌లో ఫోన్స్ ఉపయోగించారని సర్వేలో కనుగొన్నారు. 38 శాతం మంది విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు సోషల్ మీడియాను బ్రౌజ్ చేయగా.. 29 శాతం మంది పని నుంచి తొలగించబడతారనే ఆందోళన చెందుతూ నిద్రలేని రాత్రులు గడిపుతున్నారు.

mattress Maker Wakefit ద్వారా 2022 ఫిబ్రవరి నుంచి 2023 మార్చి వరకు బెంగుళూరు, దేశంలోని ఇతర ప్రాంతాలలో 'గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్‌కార్డ్' పేరుతో నిద్రపై నిర్వహించిన సర్వేలో ఈ గణాంకాలు కనుగొనబడ్డాయి. ఇందులో 10,000 మంది పాల్గొన్నారు. సమగ్ర సర్వే యొక్క ఆరో ఎడిషన్‌.. బెంగళూరులోని 4,000 మంది ప్రతివాదులతో.. వివిధ వయస్సు సమూహాలు, విభిన్న జనాభాలో నిర్వహించబడింది. భారతదేశంలోని సిలికాన్ వ్యాలీగా పిలవబడుతున్న బెంగళూరులోని ప్రజల నిద్ర విధానాలను ఇది చూపించింది.

26 శాతం మందికి 'నిద్రలేమి'
13 నెలల సర్వేలో.. ఇందులో అభిప్రాయాలు వ్యక్తం చేసినవారిలో 61 శాతం మంది రాత్రి 11 గంటల తర్వాత పడుకున్నారని తేలింది. అయితే సరైన నిద్రవేళ రాత్రి 10 గంటలు అని నమ్ముతారు. ఆలస్యంగా నిద్రపోయినప్పటికీ.. బెంగళూరులో 29 శాతం మంది ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య లేచారు. 60 శాతం మంది పని సమయంలో నిద్ర వస్తుందని చెప్పారు. దాదాపు 34 శాతం మంది ఉదయం రిఫ్రెష్‌గా అనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. 32 శాతం మంది మంచం కాకుండా ఇతర ప్రదేశాలలో పడుకున్నారు. అయితే 40 శాతం మంది బెడ్‌రూమ్ వాతావరణం వారి నిద్ర నాణ్యతను ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. 20 శాతం మంది మంచి పరుపు వారి నిద్రను మెరుగుపరుస్తుందని నమ్ముతున్నారు. నగరంలో చాలా మంది నిద్రలేని రాత్రులు గడుపుతుండగా.. 26 శాతం మంది వారు నిద్రలేమితో బాధపడుతున్నారని అనుమానిస్తున్నారు. వివిధ ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక వయోజన వ్యక్తికి రోజుకు 6 నుంచి 7 గంటల నిద్ర అవసరం.