Bengaluru Opposition Meeting: అధికార బీజేపీని ఎదుర్కొనేందుకు బెంగళూరులో విపక్షాల కూటమి కీలక భేటీ సోమవారం రాత్రి జరిగింది. సుమారు రెండు గంటలపాటు సాగిన  ఈ భేటీ పలు కీలక అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే ఈ భేటీకి పలు పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. సామాజిక న్యాయం కోసం భావ సారూప్యత కలిగిన విపక్ష పార్టీలన్ని కలిసి పనిచేస్తాయని  కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. 

Bengaluru Opposition Meeting: దేశంలో జరగబోయే తదుపరి సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కంటే తక్కువ సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన పార్టీలన్నీ తమ సన్నాహాలను ప్రారంభించాయి. పాట్నా సమావేశం తరువాత.. నేడు ప్రతిపక్ష పార్టీలన్నీ బెంగళూరులో సమావేశమయ్యాయి.ప్రధానంగా బీజేపీని ఎదుర్కొనేందుకు బెంగళూరులో తలపెట్టిన విపక్షాల కూటమి కీలక భేటీ సోమవారం రాత్రి జరిగింది. విందుతో పాటు ఎన్నికలపై ప్రతిపక్ష నేతలు మేధోమథనం సుమారు రెండు గంటలపాటు సాగింది. పలు కీలక అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే ఈ భేటీకి పలు పార్టీలకు చెందిన అగ్రనేతలు హాజరయ్యారు. 

  • కాంగ్రెస్ అధ్యక్షతన ప్రతిపక్ష పార్టీల రెండో సమావేశం జరిగింది. సోమవారం నాటి విందులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్, డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్. పాల్గొన్నారు.
  • ఈ సమావేశంలో వీరితో పాటు శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు మరియు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ , ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అధినేత్రి మెహబూబా ముఫ్తీతో పాటు మరికొందరు నేతలు కూడా అనధికారిక సమావేశానికి హాజరయ్యారు.
  •  సామాజిక న్యాయం కోసం భావ సారూప్యత కలిగిన విపక్ష పార్టీలన్ని కలిసి పనిచేస్తాయని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. నేడు సగం మంచి పని పూర్తయిందన్నారు. మరోవైపు.. విపక్ష నేతల డిన్నర్ మీటింగ్ పై కాంగ్రెస్ అధినేత పవన్ ఖేడా మాట్లాడుతూ.. నేడు ఎలాంటి సమావేశం జరగలేదని, అనధికారిక చర్చలు మాత్రమే జరిగాయన్నారు. రేపు మళ్లీ కలుద్దాం, తర్వాత అన్నీ చెబుతామని అన్నారు. 
  • ఎన్సీపీ అధినేత శరద్ పవార్, మరికొందరు నేతలు సోమవారం ఈ సమావేశానికి హాజరు కాలేదు. అయితే.. రెండో రోజు విపక్షాల భేటీకి తన కుమార్తె సుప్రియా సూలేతో కలిసి శరద్ పవార్ హాజరవుతారని ఎన్సీపీ తెలిపింది. కానీ.. తొలిరోజు భేటీకి హాజరుకాకపోవడానికి గల కారణాలు మాత్రం చెప్పలేదు. 
  • ఈ సమావేశంలో 26 పార్టీలు పాల్గొన్నాయి. సమావేశ స్థలంలో 'యునైటెడ్ వి స్టాండ్' (మేము ఒక్కటే) అని రాసి ఉన్న బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. బెంగళూరు రోడ్లు కూడా ఈ నినాదంతో కూడిన పోస్టర్లతో నిండిపోయాయి.
  • ఈ సమావేశం నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ట్వీట్ చేస్తూ.. శుభారంభం సగం మార్గం అని అన్నారు. సామాజిక న్యాయం, సమ్మిళిత అభివృద్ధి, జాతీయ సంక్షేమ ఎజెండాను ప్రోత్సహించడానికి సమాన ఆలోచనలు కలిగిన ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తాయి. ద్వేషం, విభజన, ఆర్థిక అసమానత, దోపిడీ, నిరంకుశ, ప్రజా వ్యతిరేక రాజకీయాల నుండి భారతదేశ ప్రజలను విముక్తి చేయాలనుకుంటున్నామని విపక్షాలు ఈ భేటీని నిర్వహించాయి. ప్రధానంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని గద్దె నించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాయి.
  • ఎన్డీయే సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా కేవలం బూటకమని మిగిలిపోయిన ఎన్డీయేను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. 26 ప్రతిపక్ష పార్టీల కలయిక ప్రత్యక్ష ప్రభావం. జూన్ 23న పాట్నాలో విజయవంతమైన సమావేశం జరిగింది. బెంగళూరులో జరిగే సమావేశంలో మరిన్ని పార్టీలు పాల్గొంటున్నాయి. దీంతో నివ్వెరపోయిన బీజేపీ ఎన్డీయేను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తోంది.
  •  కాంగ్రెస్ పార్టీ మాజీ మిత్రపక్షం హెచ్‌డి కుమారస్వామికి చెందిన జనతాదళ్ సెక్యులర్ హాజరవుతారా అనే ప్రశ్నకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పవన్ ఖేరా సమాధానమిస్తూ.. "బిజెపితో పోరాడటానికి సంకల్పం, దమ్ము ఉన్న అన్ని పార్టీలకు స్వాగతం" అని అన్నారు. "పాట్నాలో 16 నుండి బెంగళూరులో 26 వరకు వ్యతిరేకత పెరుగుతుంది. మేము ఇంకా చాలా సమావేశాలు చేస్తాము. సమస్యలపై చర్చిస్తామని తెలిపారు. 
  • ప్రతిపక్ష పార్టీల సమావేశాన్ని టార్గెట్ చేస్తూ జేపీ నడ్డా ప్రతిపక్ష పార్టీల కూటమికి పునాది స్వార్థంపైనే ఉందని అన్నారు. ఈ సమావేశానికి కౌంటర్ గా బీజేపీ ఢిల్లీలో నేడు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశంలో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తో పొత్తు పెట్టుకున్న 38 పార్టీలు తమ హాజరును ధృవీకరించాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.