Asianet News TeluguAsianet News Telugu

మెట్రో పిల్లర్ కి బీటలు.. ప్రయాణికుల్లో ఆందోళన

బెంగళూరు నగర మెట్రో రైల్వే స్టేషన్ కి చెందిన పిల్లర్స్ కి బీటలు కనిపించాయి. ఆరు నెలల క్రితమే ఎంజీ రోడ్డు ట్రినిటీ సర్కిల్ మెట్రో పిల్లర్ కి బీటలు కనిపిస్తే.. దానిని అధికారులు సరిచేశారు. మళ్లీ.. ఇప్పుడు అదే పిల్లర్ కి బీటలు కనిపించాయి. 

Bengaluru: One Metro pillar fixed, fault spotted on another
Author
Hyderabad, First Published Apr 20, 2019, 9:52 AM IST

బెంగళూరు నగర మెట్రో రైల్వే స్టేషన్ కి చెందిన పిల్లర్స్ కి బీటలు కనిపించాయి. ఆరు నెలల క్రితమే ఎంజీ రోడ్డు ట్రినిటీ సర్కిల్ మెట్రో పిల్లర్ కి బీటలు కనిపిస్తే.. దానిని అధికారులు సరిచేశారు. మళ్లీ.. ఇప్పుడు అదే పిల్లర్ కి బీటలు కనిపించాయి. దీంతో.. మెట్రో ఎక్కడానికి ప్రయాణికులు కంగారు పడుతున్నారు.

అయితే బీఎంఆర్‌సీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అజయ్‌ సేఠ్‌ ఈ విషయంపై రైలు ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. శుక్రవారం ఉదయం బసవనగుడి సమీపంలో ఉన్న సౌత్‌ ఎండ్‌ సర్కిల్‌లో పిల్లర్‌లో చీలిక కనిపించిందన్న సమాచారం క్షణంలోనే అన్ని వైపుల వ్యాపించి ప్రయాణికులను ఆందోళనకు గురిచేసింది.

తక్షణమే స్థలానికి చేరుకున్న బీఎంఆర్‌సీఎల్‌ అధికారులు మెట్రోలోని ఈ స్థలంలో ఏ చీలిక కనిపించలేదని స్పష్టం చేసి ప్రయాణికుల్లో ధైర్యాన్ని నింపారు. మెట్రో రెండో విడత పిల్లర్‌ యొక్క ఒక బేరింగ్‌ మాత్రం కిందకు పడింది. దానిని తక్షణమే సరిచేశారు. మెట్రో రైలు మార్గంలో అన్ని పిల్లర్‌లలో బేరింగ్‌లు కిందకు పడటం సాధారణంగా జరుగుతుంది. దీనిని అప్పుడప్పుడు సరిచేస్తామని, అదే విధంగా ఈ భాగంలో బేరింగ్‌ను సరిచేస్తామని బీఎంఆర్‌సీఎల్‌ ప్రజా సంప్రదింపుల అధికారి యశ్వంత్‌ తెలియజేశారు
 

Follow Us:
Download App:
  • android
  • ios