అతనికి అప్పటికే వివాహమైంది. అందమైన భార్య ఉంది. కానీ అతను పరాయి మోజులో పడిపోయాడు.  మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్త భార్యకు తెలిసిపోయింది. వెంటనే భర్తను నిలదీసింది. అంతే... తన అక్రమ సంబంధం  గురించి భార్యకు తెలియడం అతనికి నచ్చలేదు. అంతకంటే ఎక్కువగా ఆ విషయంలో భార్య తనను నిలదీయడాన్ని తట్టుకోలేకపోయాడు. వెంటనే పథకం ప్రకారం నిద్రపోతున్న భార్యను అంతమొందించాడు. ఈ  సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కర్ణాటక రాష్ట్రంలోని రామనగర పట్టణానికి చెందిన దీప(24)కు వెంకటేష్ తో 2019 మార్చి 3వ తేదీన వివాహం జరిగింది. కాగా.. వెంకటేష్ జిల్లా ఆస్పత్రిలో డేటా ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా... వెంకటేష్ కి మరో మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా దీపకు తెలిసింది.

ఇదే విషయంలో భర్తను నిలదీసింది. భార్యకు నిజం తెలియడంతో తట్టుకోలేక.. ఆమె నిద్రపోతున్న సమయంలో విషాన్ని ఇంజెక్షన్ ద్వారా ఆమె శరీరంలోకి ఎక్కించాడు. దీంతో... ఆమె చనిపోయింది. విషయం తెలుసుకున్న దీప తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తరలించగా... అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

Also Read తమిళనాడు జల్లికట్టులో విషాదం: ఒకరి మృతి, ఆరుగురికి గాయాలు...

వెంటనే.. దీప తండ్రి తిమ్మయ్య... తన కూతురిని చంపింది అల్లుడే అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా.. అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

తన భార్యే తనను మోసం చేసిందటూ పోలీసులకు చెప్పడం గమనార్హం. కాగా.. వీరికి గతేడాది మార్చిలో పెళ్లికాగా... జులైలో తన భర్తకు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందన్న విషయం దీపకు తెలిసింది. ఇదే విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు తెలియజేసింది.

ఇరువురి పెద్దలు కూర్చొని.. దంపతులు ఇద్దరితో మాట్లాడి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. పెద్దలు సర్దిచెప్పడంతో.. వెంకటేష్ మారినట్లే నటించాడు. ఆ తర్వాత తాజాగా తన భర్త  మళ్లీ తనను మోసం చేస్తున్నాడనే విషయం దీపకు తెలిసింది. ఇదే విషయంపై ప్రశ్నించింది. అందుకే కోపంతో చంపేశాడు. ప్రస్తుతం నిందితుడుని పోలీసుల అరెస్ట్ చేశారు.