బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా వైరస్ బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో శ్మశానాల మృతదేహాలను తీసుకొచ్చిన వాహనాలు బారులు తీరుతున్నాయి. 

బెంగళూరులో కరోనా బారిన పడి నిత్యం 50 మంది వరకు మరణిస్తున్నారు. నగరంలోని ఐదు స్మశానవాటికలో కోవిడ్ మృతులకు అంత్యక్రియలు చేస్తున్నారు.  ప్రతిరోజూ కనీసం 20 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.  

స్మశాన వాటిక వద్ద ఒక్కో అంబులెన్స్ అంత్యక్రియల కోసం నాలుగైదు గంటలు క్యూలో వేచి చూడాల్సి వస్తోంది బెంగళూరు జలహళ్లి వద్ద ఉన్న సుమన హళ్లి, కెంగేరి, బొమ్మనహళ్లి, పెనత్తూరు  శ్మశానవాటికల్లో కోవిడ్ తో మరణించిన మృతదేహాలకు అంత్యక్రియలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలతో ఈ ప్రాంతాల్లో అంత్యక్రియలు చేపడుతున్నారు. ఇదే సమయంలో అంత్యక్రియలు చేసే సిబ్బందికి అత్యంత అవసరం అయిన పీపీఈ కిట్లు లభించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది ఏప్రిల్లో 280 మంది బెంగళూరు వాసులు కోవిడ్ తో మృత్యువాత పడ్డారు. ఏప్రిల్ 13, 14 తేదీల్లో కరోనా సోకిన 55 మంది మృత్యువాతపడ్డారు, ఈ ఏడాది జనవరిలో 66 మంది, ఫిబ్రవరిలో 88, మార్చిలో 147 మంది, ఏప్రిల్లో 280 మంది మరణించారు. ఇందులో 210 మందికి పైగా 60 ఏళ్లు పైబడిన వృద్ధులే ఉన్నారు.