స్నేహితుడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకొని... స్నేహానికి ద్రోహం చేశాడు. ఆ విషయం స్నేహితుడికి తెలిసిపోయిందని... ఎలాగైనా అతని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. అనుకున్నట్లుగానే స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... బెంగళూరు నగరానికి చెందిన మునియప్ప, రమేష్ అనే ఇద్దరు బాల్య స్నేహితులు. రమేష్ ట్రక్ తోలుతూ జీవనం సాగించేవాడు. కాగా.... స్నేహితుడు కావడంతో మునియప్ప తరచూ రమేష్ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఆ క్రమంలో రమేష్ భార్య కళావతితో అతనికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.

ఈ విషయం రమేష్ కి తెలియడంతో... మునియప్ప, రమేష్ భార్య ఇళ్లు వదిలి పారిపోయారు. వేరే ప్రాంతంలో ఇద్దరూ కాపురం పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. కాగా... ఇటీవల మునియప్ప స్వగ్రామానికి వచ్చాడు. దీంతో వెంటనే రమేష్ వెళ్లి తన భార్య గురించి ఆరా తీశాడు. కాగా... అతనికి కనీసం సమాధానం కూడా చెప్పలేదు. 

ఆ తర్వాత కళావతి కూడా స్వగ్రామానికి వచ్చింది. కానీ భర్త రమేష్ వద్దకు రాకుండా.. ప్రియుడి దగ్గరే ఉండిపోయింది. దాంతో  గ్రామ పెద్దలతో పంచాయతి పెట్టించిన రమేష్‌.. కళావతిని ఇంటికి రావాల్సిందిగా కోరాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. అంతేకాక విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది.

ఈ క్రమంలో భార్యతో సంబంధం పెట్టుకోవడమే కాక.. విడాకులు కోరేలా చేశాడనే కోపంతో మంగళవారం రమేష్‌, మునియప్పతో గొడవకు దిగాడు. ఈ వివాదం కాస్త పెద్దది కావడంతో ఆగ్రహంతో ఊగిపోయిన మునియప్ప.. తండ్రి తుపాకీతో రమేష్‌ మీద కాల్పులు జరిపాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే స్పందించి రమేష్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మునియప్ప, అతడి తండ్రి, సోదరుడు, రమేష్‌ భార్య కళావతిల మీద కేసు నమోదు చేశారు.