బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన రాక్షస లైంగిక దాడికి సంబంధించి బాధితురాలు కొత్త విషయాలు చెప్పింది. బంగ్లాదేశ్ కు చెందిన ఆ యువతిపై సామూహిక అత్యాచారం కేసులో కీలకమైన సమాచారం వెలుగు చూసింది. బెంగళూరులో ఉపాధి చూపిస్తామని చెప్పడంతో తాను ఢాకా నుంచి వచ్చినట్లు ఆయన యువతి చెప్పింది. 

బాధిత యువతిని కేరళలో గుర్తించి, బెంగళూరు తీసుకుని వచ్చారు. ఆమెను బెంగళూరులోని ఇందిరా నగర్ పోలీసు స్టేషన్ లో విచారించారు.  తనపై దాడి జరిగిన మర్నాడే తాను కేరళకు వెళ్లిపోయినట్లు ఆయన తెలిపింది. అక్కడే తన ప్రియుడు ఉన్నాడని, దుండగుల భయంతో అక్కడికి వెళ్లి తల దాచుకున్నానని ఆమె చెప్పింది. 

ఇటీవల బెంగళూరులో కొందరు బంగ్లాదేశీ కూలీలు విందు చేసుకోగా, అందులో యువతిపై నలుగురు వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అందుకు ఇద్దరు మహిళలు సహకరించారు. ఈ ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తనకు తల్లిదండ్రులు లేరని, కుటుంబ బంధువులు కూడా ఎవరూ లేరని బాధిత యువతి పోలీసులకు చెప్పింది. 

గతంలో తాను దుబాయ్ లో డ్యాన్సర్ గా పనిచేసినట్లు తెలిపింది. ఆ తర్వాత ఢాకాకు వెళ్లిపోయానని, నిందితుల సూచనతో బెంగళూరు వచ్చానని చెప్పింది. డబ్బుల విషయంలో నిందితులతో గొడవ జరిగిందని, అత్యాచారం జరిగిన సమయంలో మరో యువతి కూడా ఉందని ఆమె చెప్పింది. 

వీడియోలో రికార్డు అయిన దృశ్యాలకు, యువతి చెప్పిన విషయాలకు మధ్య పొంతన లేదని తెలుస్తోంది. మరో యువతి కోసం పోలీసులు గాలిస్తున్నారు