బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన దిగ్భ్రాంతికరమైన లైంగిక దాడి కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. బంగ్లాకు చెదిన 22 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం చేసి, చిత్రహింసలకు గురి చేసిన కేసులో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరుగురిలో ఇద్దరు యువతులు కూడా ఉన్నారు.

ఈ సంఘటనకు సంబంధించిన మొదటి వీడియో ఓ వైపు వైరల్ అవుతుండగానే మరో వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అస్సాం, బంగ్లాదేశ్ ల్లో ఆ యువతీయువకులతో పరిచయం ఉన్నవారి నుంచి వచ్చిన ఫిర్యాదులతో పోలీసులు రంగంలోకి దిగి ఆరుగురిని అరెస్టు చేశారు. 

నిందితుల్లో హైదరాబాదుకు చెందిన హకీల్ అనే ఉన్నట్లు తెలుస్తోంది. అతనితో పాటు బంగ్లాదేశ్ కు చెందిన సాగర్, మహమ్మద్ బాబా కేశ్, రియాద్ బాబు, నస్రత్, కాజల్ లను పోలీసులు నిందితులుగా గుర్తించారు. అరెస్టయిన ఇద్దరు యువతులు రియాద్ బాబు భార్యలు. 

సీన్ రీకనస్ట్రక్షన్ కోసం పోలీసులు నిందితులను శుక్రవారం ఉదయం పోలీసులు చెన్నసంద్ర సమీపంలోిని కనగనరకు తీసుకుని వెళ్లారు. ఈ సమయంలో రియాద్ బాబు, సాగర్ పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో వారిద్దరు గాయపడ్డారు. 

నిందితులపై మానవ అక్రమ రవాణా, అత్యాచారం, చిత్రహింసలు, నిర్భయ తదితర చట్టాల కింద కేసులు నమోదు చేశారు. నిందితులు ఉన్న ఇంట్లోని చాపలను, దిండ్లను, మద్యం సీసాలను ఫోరెన్సిక్ నిపుణులు స్వాధీనం చేసుకని రసాయన పరీక్షల నిమిత్తం పంపించారు. 

రెండేళ్ల క్రిందట బాధిత యువతి బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్ిచంంది. ఓ బార్ లో డ్యాన్సర్ గా కుదిరింది. అంతకు ముందు దుబాయ్ లో అలాంటి వృత్తినే చేపట్టినట్లు తెలుస్తోంది. భారత్ లోకి అక్రమంగా ప్రవేశించిన ఆ యువతి హైదరాాబదులో ఓ మసాజ్ పార్లర్ లో పనిచేసింది. తనకు పరిచయం ఉన్న నలుగురు యువకులను, ఇద్దరు యువతులను బంగ్లాదేశ్ నుంచి అస్సాం మార్గంలో భారత్ లోకి తీసుకుని వచ్చి బెంగళూరులో స్థిరపడేలా చేసింది. 

బెంగళూరులోని సుబ్రహ్మణ్యనగర్ లో కిరాయిడి ఇంటిని తీసుకుని బంగ్లాదేశ్ యువతీయువకులకు అదే చిరునామాతో ఆధార్ కార్డులు వచ్చేలా చేసింది. ఆమె ద్వారా వచ్చినవారే ఆమెపై దాడికి పూనుకోవడం ఈ సంఘటనలోని అత్యంత విషాదకరమైన విషయం.  వారు ఆ యువతితో వ్యభిచారం చేయించినట్లు దర్యాప్తు అధికారుుల గుర్తించారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతులను రప్పించి అదే పనిచేయించినట్లు కూడా పోలీసులు గుర్తించారు. 

తాను వ్యభిచార వృత్తి మానేసి స్పా పెట్టుకుంటానని బాధిత యువతి చెప్పింది. దాంతో ఆర్థిక లావాదేవీల వద్ద గొడవ ప్రారంభమైంది. నస్రత్, కాజల్ స్పా వద్దంటూ ఆమెపై ఒత్తిడి చేశారు. మంచానికి కట్టేసి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ప్రైవేట్ పార్ట్స్ మీద మద్యం సీసాలతో దాడి చేశారు ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటిని చూసిన కొందరు పోలీసులకు చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. 

తనపై దాడి జరిగిన తర్వాత యువతి వారి నుంచి తప్పించుకుని కేరళలోని కొజికోడ్ కు వెళ్లి తనకు పరిచయం ఉన్న మహిళ వద్ద తలదాచుకుంది. అక్కడే స్పాను ప్రారంభించేందుకు సన్నాహాలు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈమెను బెంగుళూరు నుంచి తీసుకుని వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.