బెంగళూరులో ఓ వ్యక్తి కరోనాతో చనిపోగా... అతని బాడీని కొన్ని గంటలు అంబులెన్స్ లో ఉంచడానికి ఏకంగా రూ.60వేలు డిమాండ్ చేయడం గమనార్హం
దేశంలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఊహించని రీతిలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ క్రమంలో కరోనా రోగులను ఆస్పత్రిలో చేర్పించడానికి కనీసం బెడ్లు కూడా దొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక అంబులెన్స్ కి ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొద్ది గంటలపాటు.. కరోనా రోగి బాడీని అంబులెన్స్ లో ఉంచడానికి వేలకు వేలు డిమాండ్ చేస్తుండటం గమనార్హం.
తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. బెంగళూరులో ఓ వ్యక్తి కరోనాతో చనిపోగా... అతని బాడీని కొన్ని గంటలు అంబులెన్స్ లో ఉంచడానికి ఏకంగా రూ.60వేలు డిమాండ్ చేయడం గమనార్హం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
బెంగళూరులోని మాతికెరీ ప్రాంతానికి చెందిన ఆర్వీ ప్రసాద్ ఇటీవల కరోనా బారిన పడ్డారు. దీంతో... ఆయనను ఆస్పత్రిలో చేర్పించేందుకు కుటుంబసభ్యులు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే.. వారికి కనీసం ఆస్పత్రిలో బెడ్ కూడా దొరకలేదు. ఈ క్రమంలో అనూహ్యంగా ఆయన మంగళవారం ఇంట్లో కుప్పకూలిపోయాడు. అదే సమయంలో.. ఓ ఆస్పత్రిలో బెడ్ ఖాళీగా ఉందని తెలియగానే.. అక్కడికి ఆయనను తరలించారు.
ఆస్పత్రికి వెళ్లే సమయానికే.. అతను చనిపోయినట్లు గుర్తించారు. అప్పటి సమయం రాత్రి 10 గంటలు దాటడంతో...ఆ సమయంలో అంత్యక్రియలు చేయడం కుదరదు. దీంతో.. మరసటి రోజు అంత్యక్రియలు నిర్వహించే వరకు.. మృతదేహాన్ని అంబులెన్స్ లో ఫ్రీజర్ లో ఉంచాలని భావించారు. ఈ మేరకు అంబులెన్స్ డ్రైవర్ తో బేరం కుదుర్చుకోగా.. అతను రూ.60వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
చేసేది లేక.. ముంద రూ.3వేలు చెల్లించి.. డెడ్ బాడీని అంబులెన్స్ లో ఫ్రీజ్ చేశారు. మరుసటి రోజు ఉదయం కరోనా రోగి ఆర్వీ ప్రసాద్ కుమార్తె భవ్య.. అంబులెన్స్ డ్రైవర్ కి మరో రూ. పదివేలు చెల్లించింది. మిగిలిన డబ్బు అందలేదని ఆమె రిక్వెస్ట్ చేసినా అంబులెన్స్ డ్రైవర్ కరగలేదు.
డెడ్ బాడీని రోడ్డుమీదే వదిలేస్తానంటూ నానా రచ్చ చేశాడు. దీంతో.. భవ్య.. తన మెడలోని చైన్ అమ్మి డబ్బులు ఇద్దామని అనుకుంది. ఈ క్రమంలో.. అక్కడి వ్యవహారం పోలీసుల కంట పడింది. దీంతో వారు వచ్చి సమస్యను పరిష్కరించారు. ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తున్నావని అంబులెన్స్ డ్రైవర్ ని మందలించేందుకు ప్రయత్నించగా.. అతను మాట మార్చడం గమనార్హం.
తాను కేవలం రూ.6వేలు మాత్రమే చెల్లించమని అడిగానని.. నా ఫేస్ కి మాస్క్ ఉండటంతో వారు.. రూ.60 వేలు అనుకున్నారని చెప్పడం గమనార్హం. మొత్తానికి రూ.13వేలు చెల్లించి.. ఆ తర్వాత మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
కాగా.. సదరు అంబులెన్స్ డ్రైవర్.. కరోనా రోగి మృతదేహాన్ని తన అంబులెన్స్ లో ఫ్రీజ్ చేయడానికి రూ.35వేల దాకా వసూలు చేస్తాడట. కొందరి దగ్గర అంతకన్నా ఎక్కువ వసూలు చేస్తారని సమాచారం. ఈ కరోనా క్రైసిస్ ని ఆ అంబులెన్స్ డ్రైవర్ ఇలా క్యాష్ చేసుకుంటుండటం గమనార్హం.
