పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్  అధినేత్రి మమతా బెనర్జీ గురువారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో వీరి సమావేశం జరిగింది.

అనంతరం దీదీ మీడియాతో మాట్లాడుతూ.. అసోంలో జాతీయ పౌర జాబితా అంశంపై హోంమంత్రితో చర్చించినట్లు తెలిపారు. అలాగే అసోంలో ఎన్ఆర్‌సీ జాబితా నుంచి 19 లక్షల మంది పేర్లను తొలగించిన అంశంపైనా చర్చించినట్లు వెల్లడించారు.

బెంగాల్‌లో ఎన్ఆర్‌సీని అమలు చేస్తారంటూ వచ్చిన కథనాలపై మీడియా ప్రతినిధులు మమతను ప్రశ్నించగా.. ఆమె ఖండించారు.

అవన్నీ వదంతులేనని.. బెంగాల్‌లో ఎన్ఆర్‌సీ అవసరమే లేదని సీఎం తేల్చి చెప్పారు. కాగా.. ఢిల్లీ పర్యటనలో ఉన్న మమతా బెనర్జీ బుధవారం ప్రధాని నరేంద్రమోడీతో సమావేశమైన సంగతి తెలిసిందే.