Asianet News TeluguAsianet News Telugu

మమతతో సువేందు అధికారి భేటీ.. బెంగాల్ రాజకీయాల్లో కలకలం

బెంగాల్ రాజకీయాల్లో శుక్రవారం ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం బద్ధ శత్రువులుగా వున్న సీఎం మమతా బెనర్జీ, బీజేపీ నేత సువేందు అధికారి చాలా రోజుల తర్వాత కలుసుకున్నారు. 

bengal cm Mamata Banerjee meets bjp leader Suvendu Adhikari for the first time after Nandigram defeat
Author
First Published Nov 25, 2022, 4:42 PM IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, ఆమె మాజీ అనుచరుడు , ప్రస్తుత బీజేపీ నేత సువేందు అధికారికి మధ్య వున్న వైరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందిగ్రామ్‌లో మమతను ఓడిస్తానని శపథం చేసిన సువేందు అన్న మాట నిలబెట్టుకున్నారు. అటు అసెంబ్లీలోనూ మమత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు సువేందు. టీఎంసీని వీడిన తర్వాత సువేందు , మమతలు పరస్పరం ఎదురుపడింది లేదు. అయితే ఊహించనీ రీతిలో వీరిద్దరు కలుసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అసెంబ్లీ విపక్షనేతగా వున్న సువేందు అధికారి.. శాసనసభ ఆవరణలో వున్న మమత గదికి వెళ్లారు. ఆయన వెంట మరో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు కూడా వున్నారు. ఈ సందర్భంగా సువేందును అప్యాయంగా పలకరించారు. 

ALso REad:డిసెంబర్‌లో దీదీ సర్కార్ కూలిపోవడం ఖాయం.. 2024లోనే బెంగాల్ ఎన్నికలు: సువేందు సంచలనం

కాగా..  పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ  తన పార్టీ తృణమూల్ కాంగ్రెసుకు తిరుగులేని విజయం సాధించి పెట్టారు. అయితే, తాను పోటీ చేసిన నందిగ్రామ్ లో సమీప బిజెపి ప్రత్యర్థి సువేందు అధికారిపై ఓటమి పాలయ్యారు. తనకు అత్యంత సన్నిహితుడుగా ఉంటూ వచ్చిన సువేందు అధికారి బిజెపిలో చేరి నందిగ్రామ్ నుంచి పోటీ చేయడానికి సిద్ధపడ్డారు. దీంతో ఆయనపై పోటీ చేసి సువేందును ధీటుగా ఎదుర్కున్నారు. ఏళ్ల తరబడిగా సువేందు అధికారి నందిగ్రామ్ కు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. చివరకు సువేందు అధికారి 1736 ఓట్ల తేడాతో మమతాపై విజయం సాధించారు.

Follow Us:
Download App:
  • android
  • ios