బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ పై కోల్ కత్తాలో శుక్రవారం గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం ఘోష్ మార్నింగ్ వాక్ కి వెళ్లారు. అక్కడి నుంచి లేక్ టౌన్ లో నిర్వహిస్తున్న ఛాయ్ పే చర్చలో పాల్గొనాలని భావించారు. కాగా.. మార్గమధ్యంలో ఆయనపై దుండగులు దాడికి పాల్పడ్డారు.

బీజేపీ నేత ఘోష్ ని చుట్టుముట్టి... అనూహ్యంగా దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఇద్దరు కార్యకర్తలకు తీవ్రగాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తంత ఆస్పత్రికి తరలించారు. అనంతరం దుండగులు అక్కడి నుంచి పరారయ్యాడు. ఘోష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

ఈ ఘటన జరిగిన సమయంలో తృణమూల్ కాంగ్రెస్ నేతలు అక్కడే ఉండటంతో పలు అనుమానాలు తావిస్తోందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఘోష్ పై గత ఏడాది సెప్టెంబర్ లోనూ తూర్పు మిడ్నపూర్ లో తృణమూల్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఆయనతోపాటు మరో ఆరుగురు కార్యకర్తలు గాయాలపాలయ్యారు.