పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని శుక్రవారం నాడు ఆమె స్వయంగా ప్రకటించారు. స్వల్ప జ్వరంతో బాధపడుతూ గత వారం రోజులుగా ఆమె స్వీయ నియంత్రణలో ఉన్నారు.

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ లాకెట్ ఛటర్జీ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని శుక్రవారం నాడు ఆమె స్వయంగా ప్రకటించారు. స్వల్ప జ్వరంతో బాధపడుతూ గత వారం రోజులుగా ఆమె స్వీయ నియంత్రణలో ఉన్నారు.

Scroll to load tweet…

తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆమె ప్రకటించారు. అన్ని విషయాలను మీతో పంచుకొంటానని ఆమె ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
 మహిళల అంశాలపై ఆమె పలు పోరాటాలు చేశారు. ప్రజా సమస్యలపై ఆమె స్పందించే తీరుపై పార్టీ నాయకత్వం ఆమెకు పార్టీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించింది. 

 బీర్భం జిల్లాలో జూన్‌ 19న అమర జవాన్‌ రాజేష్‌ ఓరంగ్‌ అంత్యక్రియల్లో బీజేపీ ఎంపీ సౌమిత్ర ఖాన్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు.వీర జవాన్‌కు వీడ్కోలు పలికేందుకు వందలాదిగా ప్రజలు అంత్యక్రియలకు తరలివచ్చారు. 

also read:కరోనా వైరస్‌కు వ్యాక్సిన్:క్లినికల్ ట్రయల్స్‌కి అనుమతి పొందిన ఇండియన్ కంపెనీ

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో విపక్ష నేత అధీర్‌ రంజన్‌ చౌధరి సైతం పాల్గొన్నారు. లాకెట్ ఛటర్జీకి కరోనా సోకిందని తేలడంతో ఆమెతో కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న నేతలు, సన్నిహితుల్లో ఆందోళన వ్యక్తమౌతోంది.

రాష్ట్రంలో కరోనా కేసులు 19,819 కి చేరుకొన్నాయి.13,037 మంది కరోనా నుండి కోలుకొన్నారు. కరోనాతో 699 మంది మరణించినట్టుగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన బులెటిన్ స్పష్టం చేసింది.