లంచం ఇచ్చేందుకు భిక్షాటన చేసిన వింత సంఘటన చెన్నైలో జరిగింది. గ్రామ నిర్వాహక అధికారికి లంచం ఇచ్చేందుకు భిక్షాటనలో పాల్గొన్న 39 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 

చెన్నైలోని కళ్లకురిచ్చి సబ్‌ కలెక్టర్‌ కార్యా లయం ముందు ప్రజా హక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో ఈ భిక్షాటన జరిగింది. ఇందులో ఆందోళనకారులు ప్లకార్డులతో పాల్గొన్నారు. వృద్ధాప్య, వితంతు పింఛన్లు మంజూరు చేసేందుకు గ్రామనిర్వాహక అధికారులు లంచం డిమాండ్‌ చేస్తున్నారని, దీంతో తాము భిక్షాటన చేస్టున్నట్లు తెలిపారు. 

ఇది భిక్షాటన కాదని, ఆందోళన అని దీనికి అనుమతి లేదు అంటూ  భిక్షాటన చేపట్టిన 39మందిని పోలీసులు అరెస్ట్ చేసి దగ్గర్లోని కల్యాణమండపానికి తరలించారు.