IMF on India Wheat Ban: గోధుమ‌లను ఇత‌ర దేశాల‌కు ఎగుమ‌తి చేయ‌కుండా నిషేధిస్తూ భార‌త్ తీసుకున్న నిర్ణ‌యాన్ని పునఃప‌రిశీలించాల‌ని అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అభ్య‌ర్థించింది. అంత‌ర్జాతీయ ఆహార భ‌ద్ర‌త‌, ప్ర‌పంచ సుస్థిర‌త‌తో భార‌త్ కీల‌క పాత్ర పోషించాల‌ని ఐఎంఎఫ్ చీఫ్ క్రిష్టాలినా జార్జియోవా మంగ‌ళ‌వారం పేర్కొన్నారు.  

IMF on India Wheat Ban:  భార‌త్ గోధుమల ఎగుమతి నిషేధం విధించ‌డం ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు సృష్టించిందనీ, ఆ నిర్ణ‌యాన్ని పునఃప‌రిశీలించాల‌ని భారతదేశానికి అంత‌ర్జాతీయ ద్ర‌వ్య‌నిధి సంస్థ (IMF) విజ్ఞప్తి చేసింది. అంత‌ర్జాతీయ ఆహార భ‌ద్ర‌త‌, ప్ర‌పంచ సుస్థిర‌త‌తో భార‌త్ కీల‌క పాత్ర పోషించాల‌ని ఐఎంఎఫ్ చీఫ్ క్రిష్టాలినా జార్జియోవా మంగ‌ళ‌వారం పేర్కొన్నారు. గోధుమల కొరత కారణంగా భారత్ తన ఎగుమతులను నిషేధించింది. ఇప్పుడు ఐఎంఎఫ్ చీఫ్ కూడా ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయాలని, లేకుంటే భారీ ఆహార సంక్షోభం తలెత్తుతుందని భారత్‌ను అభ్యర్థించారు. 

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా, భారతదేశం నిషేధాన్ని ఎత్తివేయకపోతే, అనేక ఇతర దేశాలు అదే పని చేయడం ప్రారంభిస్తాయని, ఆపై ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవడం కష్టమని IMF చీఫ్ అన్నారు. ప్ర‌పంచ ఆర్థిక వేదిక (డ‌బ్ల్యూఈఎఫ్‌) స‌ద‌స్సులో పాల్గొనేందుకు వ‌చ్చిన క్రిష్టాలినా జార్జియోవా ఓ ఆంగ్ల టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. భారతదేశం 135 కోట్ల మందికి ఆహారం అందిస్తోంద‌నీ, కానీ.. వేడి వాతావ‌ర‌ణం వ‌ల్ల ఆహార ధాన్యాల దిగుబ‌డులు త‌గ్గియ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌నీ, ఈ నేప‌థ్యంలో ఇత‌ర దేశాల‌కు గోధుమ‌ల ఎగుమ‌తిపై నిషేధం విధిస్తున్నాయ‌ని, క‌నుక భార‌త్ త‌న నిషేధాన్ని పునరాలోచించుకోవాలని, ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేయాలని అభ్యర్థిస్తున్నాను. మరిన్ని దేశాలు దీన్ని చేయడం ప్రారంభిస్తే, ఈ సమస్యను ఎదుర్కోవడం కష్టమవుతుందని అన్నారు.

ఆర్థిక మందగమనంపై ఐఎంఎఫ్‌ చీఫ్‌

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) డైరెక్టర్ జనరల్ క్రిస్టాలినా జార్జివా మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుతం ఆర్థిక మందగమనం అలాంటి పరిస్థితుల్లేవ‌ని, అయితే ఇది పూర్తిగా దృశ్యమానం కాదని అన్నారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఆహార ధరలు పెరగడం ఒక ప్రధాన సమస్యగా మిగిలిపోయిందని అన్నారు. దీనితో పాటు, పెరుగుతున్న వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, డాలర్ బలపడటం, చైనాలో మందగమనం, వాతావరణ సంక్షోభం మరియు క్రిప్టోకరెన్సీల దిగజారుతున్న స్థితిని కూడా IMF డైరెక్టర్ జనరల్ క్రిస్టాలినా జార్జివా ప్రస్తావించారు.