చెన్నై: కరుణానిధి శవపేటికపై  గొప్ప మాటలను చెక్కించారు.  33 ఏళ్ల క్రితం ఎంకె స్టాలిన్‌కు చెప్పిన మాటలను  చెక్కించారు. ఎవరైనా చనిపోతే బతికున్నవారు చనిపోయిన వారి జీవితాన్ని నిత్యం గుర్తు చేసుకొనేలా  జీవనం సాగించాలని  కరుణానిధి  స్టాలిన్ కు చెప్పారు.  ఈ మాటలనే  కరుణానిధి పార్థీవదేహం ఉంచిన శవపేటికపై రాశారు.

మనం చనిపోయినప్పుడు  ప్రజలు మన సమాధిని చూసి విరామం లేకుండా పనిచేసిన వ్యక్తి విశ్రాంతి తీసుకొంటున్నారు.. అనేంతగా పేరు తెచ్చుకోవాలి అంటూ స్టాలిన్‌కు 33 ఏళ్ల క్రిత కరుణానిధి చెప్పారని పార్టీ వర్గాలు గుర్తు చేసుకొంటున్నాయి.

ఈ వ్యాఖ్యలనే కరుణానిధి పార్థీవదేహం ఉంచిన శవపేటికపై రాయించారు.  ఇటీవల స్టాలిన్ తన తండ్రి కరుణానిధికి రాసిన లేఖలో కూడ ఈ విషయాన్ని ప్రస్తావించారు. కరుణానిధి పార్థీవ దేహంపై తమిళంలో ఈ మాటలను రాశారు.