Asianet News TeluguAsianet News Telugu

భారత్-పాక్ మధ్య వివాదం.. ఆగిన యువకుని పెళ్లి

ఇటీవల భారత్-పాక్ ల మధ్య నెలకొన్న వివాదం కారణంగా.. ఓ యువకుని పెళ్లి ఆగిపోయింది. 

because of border tensions jaipur youth marriage postponed with pakistani girl
Author
Hyderabad, First Published Mar 4, 2019, 1:44 PM IST

ఇటీవల భారత్-పాక్ ల మధ్య నెలకొన్న వివాదం కారణంగా.. ఓ యువకుని పెళ్లి ఆగిపోయింది. ఈ సంఘటన రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.. రాజస్థాన్ లోని బర్మార్ జిల్లాకు చెందిన మహేంద్ర సింగ్ కి పాకిస్థాన్ కిచెందిన  చగన్ కర్వార్ కి వివాహం జరిగింది. ఈ నెల 8వ తేదీన వీరి వివాహం జరగాల్సి ఉంది. కానీ.. వారు తమ పెళ్లిని వాయిదా వేసుకున్నారు.

కిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ జరిపిన ఆత్మహుతి దాడిలో 40 మంది భారత సీఆర్పీఎఫ్‌ జవాన్లు వీరమరణం పొందడంతో ఇరుదేశాల మధ్య యుద్దవాతావరణం నెలకొంది. దీంతో ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లిని వాయిదా వేసుకున్నారు. పరిస్థితులు చక్కబడిన తర్వాతనే వివాహం జరిపిస్తామని తెలిపారు. 

‘గత నెలనే మా పెళ్లి నిశ్చయించారు. పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. వివాహ ఆహ్వాన పత్రికలు కూడా పంచాం. పాకిస్తాన్‌ నుంచి వీసాలు కూడా తీసుకున్నాం. అక్కడికి వెళ్లడానికి థార్‌ ఎక్స్‌ప్రెస్‌ టికెట్లు కూడా బుక్‌ చేశాం. కానీ ఇప్పుడు మా పెళ్లిని వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చాం. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గిన తర్వాతే పెళ్లి చేసుకుంటాం’ అని వరుడు మహేంద్ర  తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios