Asianet News TeluguAsianet News Telugu

'వారి జీవితాల నుండి ఇన్స్పిరేషన్ పొందాలి': గాల్వన్ వ్యాలీ వీరజవాన్లకు సెల్యూట్ చేసిన ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్

ఆర్మీ 'ఇండియా ఫస్ట్' నిబద్ధతను ఎత్తిచూపిన రాజ్యసభ ఎంపి రాజీవ్ చంద్రశేఖర్ రాజకీయ పార్టీలు బేధాలను పక్కన పెట్టి భారతదేశ సంఘీభావం చూపిస్తు ప్రపంచానికి, ముఖ్యంగా దేశ శత్రువులపై  సంకల్పించాలని విజ్ఞప్తి చేశారు. 

Be inspired by their lives': MP Rajeev Chandrasekhar salutes Galwan Valley bravehearts today with nation
Author
Hyderabad, First Published Jun 15, 2021, 1:50 PM IST

గతేడాది జూన్ 15న లాడఖ్ లోని గాల్వన్ వ్యాలీ వద్ద జరిగిన  ఘటనలో ప్రాణాలు కోల్పోయిన భారత సైన్యానికి చెందిన కల్నల్ సంతోష్ బాబుతో సహ మరో 20 మంది అమరవీర సైనికులకు  రాజ్యసభ ఎంపి రాజీవ్ చంద్రశేఖర్ దేశంతో పాటు మంగళవారం నివాళి అర్పించారు.

రాజీవ్ చంద్రశేఖర్ చైనాపై తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ చైనా దళాలు భారత భూభాగాన్ని దాటి, అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘిస్తూ భారత సైనికులపై దాడి చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

ఈ హింసాత్మక ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబుతో సహ మొత్తం 20 మంది భారత సైన్యం మరణించారు. నెత్తుటి ముక్కుతో వ్యవహరించిన చైనా ఆ దేశ సైన్య ప్రాణనష్టం ఇంకా వెల్లడించలేదు. భారత సైన్యం స్పందన చూసి ఆశ్చర్యపోయిన చైనా పిఎల్‌ఎ, ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు 11 రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ ఘర్షణపై వెనకడుగు వేయడానికి నిరాకరించింది.

 

భారత సార్వభౌమత్వాన్ని కాపాడుతూ 16 బీహార్ రెజిమెంట్‌కు చెందిన కల్నల్ సంతోష్ బాబుతో పాటు మరణించిన ధైర్యవంతుల మనోభావానికి, సంకల్పానికి నమస్కరిస్తు రాజీవ్ చంద్రశేఖర్ ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

ఆర్మీ  'ఇండియా ఫస్ట్' నిబద్ధతను ఎత్తిచూపిన రాజ్యసభ ఎంపీ రాజకీయ పార్టీల బేధాలను పక్కన పెట్టి సంఘీభావం చూపించి ప్రపంచానికి, ముఖ్యంగా దేశ శత్రువులపై సంకల్పించాలని విజ్ఞప్తి చేశారు. సాయుధ దళాల పురుషులు, మహిళలకు  బలంగా, ఐక్యంగా, ఓపికగా సహకరించాలని ఆయన భారతీయులందరికీ విజ్ఞప్తి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios