కోవిడ్ -19 పై అప్రమత్తంగా ఉండాలి - కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయా
భారత్ కు దగ్గరగా ఉండే దేశాల్లో, ఇతర దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని, ఈ నేపథ్యంలో కోవిడ్ -19పై అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. బుధవారం ఆయన అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
న్యూఢిల్లీ : ఆగ్నేయాసియా (southeast Asia), చైనా (China), యూరప్ (Europe)లో కరోనా కేసులు (corona casess)పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ -19పై అప్రమత్తంగా ఉండాలని, దేశ వ్యాప్తంగా నిఘా పెంచాలని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా అన్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.
బుధవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ( Union Health Minister Mansukh Mandaviya) సీనియర్ ప్రభుత్వ అధికారులు నిపుణులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి ఆయన అధ్యక్షత వహించారు. మార్చి 27 నుండి అంతర్జాతీయ విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయంపై సమీక్ష జరిపారు. అయితే గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలియజేశారు. “ భారత్ కు సమీప దేశాలైన చైనా, సింగపూర్ (singapore), వియత్నాం (Vietnam), యూరప్ (Europe)లో కూడా కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సమావేశానికి అధ్యక్షత వహించారు. కోవిడ్ మేనేజ్ మెంట్ కు సంబంధించి నిఘా, జీనోమ్ సీక్వెన్సింగ్, మరియు దేశంలో హైలెవెల్ అప్రమత్తత కొనసాగించడం వంటి మూడు ముఖ్యమైన ఆదేశాలను ఆయన జారీ చేశారు” అని సీనియర్ అధికారి ఒకరు మీడియాతో తెలిపారు.
ఈ సమావేశానికి ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, బయోటెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేష్ గోఖలే, ఫార్మాస్యూటికల్స్ విభాగం కార్యదర్శి ఎస్ అపర్ణ, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) వీకే పాల్, ICMR డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ, AIIMS డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియాతో సహా సీనియర్ ప్రభుత్వ అధికారులు NTAGI కోవిడ్-19 వర్కింగ్ గ్రూప్ చైర్మన్ ఎన్‌కె అరోరా ఈ సమావేశానికి హాజరయ్యారు.
చైనాలో మళ్లీ COVID-19 కేసులు వేగంగా పెరగుతున్నాయి. కేసులను నియంత్రించడానికి చైనా అంతటా దాదాపు 30 మిలియన్ల మంది ప్రజలు లాక్‌డౌన్‌లో ఉంచింది. దేశంలో కరోనా వైరస్ కేసులు ప్రారంభమైనప్పటి నుంచి ఇదివరకు చూడని విధంగా ప్రస్తుతం అక్కడ కేసులు పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య అధికారులు నగర వీధుల్లోకి వచ్చి సామూహిక పరీక్షలు నిర్వహిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. హాంకాంగ్‌లో కూడా పరిస్థితి మరింత దిగజారింది. అలాగే యూఎస్ లో కూడా కేసులు పెరుగుతున్నాయి.
యూఎస్ లో భయటపడుతున్న కేసుల్లో నాలుగింట ఒక వంతు ఒమిక్రాన్ కు చెందిన BA.2 సబ్ వేరియంట్ కనిపిస్తోంది. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాపిస్తుందని, అయితే దీని తీవ్రత చాలా తక్కువగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు చెబుతున్నారు. కాగా దక్షిణ కొరియా, చైనాలో 25 శాతం కొత్త కేసులు, 27 శాతం మరణాలు పెరిగాయి. ఆఫ్రికాలో కొత్త కేసులు 12 శాతం, 14 శాతం మరణాలు పెరిగాయి. యూరప్ లో 2 శాతం కేసులు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.