Karnataka : దుకాణాల నేమ్ బోర్డులపై కన్నడ భాష వాడాల్సిందే.. డెడ్‌లైన్ విధింపు, ఆ తర్వాత భారీ జరిమానాలే

బెంగళూరు మహానగర పాలక సంస్థ (బీబీఎంపీ) పరిధిలోని వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, దుకాణాల నేమ్ బోర్డులపై కన్నడ భాషను తప్పనిసరిగా ఉపయోగించాలన్న నిబంధన చాలా ఏళ్లుగానే అమలులో వుంది. నేమ్ ప్లేట్‌లపై 60 శాతం టెక్ట్స్ తప్పనిసరిగా కన్నడలోనే వుండాలని.. ఇందుకోసం ఫిబ్రవరి 28 వరకు అధికారులు గడువు విధించారు. 

BBMP sets deadline for installation of Kannada nameplates in Bengaluru ksp

బెంగళూరు మహానగర పాలక సంస్థ (బీబీఎంపీ) పరిధిలోని వాణిజ్య సంస్థలు, పరిశ్రమలు, దుకాణాల నేమ్ బోర్డులపై కన్నడ భాషను తప్పనిసరిగా ఉపయోగించాలన్న నిబంధన చాలా ఏళ్లుగానే అమలులో వుంది. అయితే ఈ రూల్‌ని సమర్ధవంతంగా అమలు చేసేందుకు అధికారులు నానా తంటాలు పడుతున్నారు. కన్నడ నేమ్ ప్లేట్‌ నిబంధనను పాటించని వ్యాపారులకు వ్యతిరేకంగా కర్ణాటక డిఫెన్స్ ఫోరమ్ ఇటీవల చేసిన నిరసనల ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. 

అయితే కన్నడ అనుకూల పోరాటంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని కర్ణాటక రక్షా వేదిక అధ్యక్షుడు నారాయణ గౌడ తేల్చిచెప్పారు. నేమ్ ప్లేట్‌లపై కన్నడ భాషకు ప్రాధాన్యం ఇవ్వకపోతే తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ పరిణామాలపై బీబీఎంపీ చీఫ్ కమీషనర్ తుషార్ గిరినాథ్ స్పందించారు. నేమ్ ప్లేట్‌లపై 60 శాతం టెక్ట్స్ తప్పనిసరిగా కన్నడలోనే వుండాలని.. ఇందుకోసం ఫిబ్రవరి 28 వరకు గడువు విధించారు. 

అయితే కన్నడ నేమ్ ప్లేట్ల స్వీకరణపై బీబీఎంపీ ద్వంద్వ వైఖరిని అవలంభించింది. కొన్ని వాణిజ్య దుకాణాలు నిబంధనలకు విరుద్ధంగా దాడులు చేసి తాత్కాలికంగా మూసివేయగా.. మరికొన్ని అలాంటి చర్యలను ఎదుర్కోలేదు. ముఖ్యంగా కన్నడ భాష అవసరాలను తీర్చడంలో విఫలమైనందున నేమ్ ప్లేట్‌లపై నల్ల రంగును పూసిన సందర్భాలు కోకొల్లలు.

బీబీఎంపీ అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. ఇప్పటికే 40 వేల దుకాణాలు కన్నడ భాష ఆదేశానికి అనుగుణంగా తమ నేమ్ ప్లేట్‌లను మార్చాయి. కానీ నగరంలోని దాదాపు 6000 నుంచి 7000 దుకాణాలు మాత్రం ఈ విషయంలో తాత్సారం చేస్తున్నాయి. దీంతో అధికారులు ఈ సంస్థలకు నోటీసులు జారీ చేశారు. ఫిబ్రవరి 28 తర్వాత నిబంధనలకు అనుగుణంగా లేని వ్యాపారాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. 

బీబీఎంపీ చీఫ్ కమీషనర్ తుషార్ గిరినాథ్ .. నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని లైసెన్స్, లైసెన్స్ లేని దుకాణాలపై నేమ్‌ప్లేట్‌లపై తప్పనిసరిగా కన్నడ భాషను ఉపయోగించాలని నొక్కి చెప్పారు. జరిమానాలు పడకుండా వుండాలంటే ఫిబ్రవరి చివరి నాటికి తమ ఆదేశాలను పాటించాలని వ్యాపార యజమానులను కోరారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios