Asianet News TeluguAsianet News Telugu

లైవ్ టెలికాస్ట్‌లోనే బీబీసీ రిపోర్టర్ జాబ్ ఫ్రస్ట్రేషన్.. వీడియో వైరల్

బీబీసీ రిపోర్ట్ డాన్ జాన్సన్ తాను లైవ్ నుంచి తప్పుకున్నారని భావించి తన జాబ్‌ పెట్టే ఒత్తిడిని వ్యక్తపరిచారు. లైవ్‌లో ఉన్న యాంకర్ షాక్ అయ్యారు. ఆడియెన్స్ అందరూ జాన్సన్ రియాక్షన్ లైవ్‌లో వీక్షించారు. ఈ వీడియోను స్వయంగా డాన్ జాన్సన్ ట్వీట్ చేస్తూ.. ఎప్పుడూ తామూ లైవ్‌లోనే ఉన్నట్టు భావించుకోవాలని పేర్కొన్నారు.
 

bbc reporter frustration on air went viral in social media
Author
New Delhi, First Published Sep 11, 2021, 3:57 PM IST

న్యూఢిల్లీ: ప్రసిద్ధ బీబీసీ చానెల్ లైవ్ టెలికాస్ట్‌లోనే ఓ రిపోర్టర్ జాబ్‌పై ఫ్రస్ట్రేషన్ వెళ్లగక్కాడు. తాను లైవ్ నుంచి వెళ్లిపోయినట్టుగా భావించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. స్వయంగా ఆయనే ఆ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ‘ఏది ఏమైనా, ఎల్లప్పుడూ నీవు లైవ్‌లో ఉన్నట్టుగానే భావించాలి’ అనే వ్యాఖ్యను జోడించి ఆ వీడియోను ట్వీట్ చేశారు.

బీబీసీ రిపోర్టర్ డాన్ జాన్సన్ ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితులపై ఢిల్లీలోని ఓ హోటల్ రూమ్ నుంచి రిపోర్ట్ చేస్తున్నారు. బీబీసీ లైవ్‌లో ఆయన తన రిపోర్ట్ వినిపించారు. ఆ రిపోర్ట్ తర్వాత యాంకర్ మరో ప్రశ్నను ఆయనకు వేశారు. కానీ, ఆ ప్రశ్న జాన్సన్‌కు చేరలేదు. దీంతో బహుశా కనెక్షన్ కట్ అయిందనుకున్నా జాన్సన్ కెమెరా నుంచి పక్కకు తప్పుకున్నారు. అప్పుడే ‘దిస్ జాబ్ మ్యాన్, దిస్ జాబ్’ అంటూ తన ఒత్తిడిని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను ఆడియెన్స్‌తోపాటు యాంకర్ కూడా విన్నారు. జాన్సన్ రియాక్షన్‌కు యాంకర్ షాక్ అయ్యారు.

 

వెంటనే యాంకర్ క్షమాపణలు తెలియజేశారు. ‘బహుశా డాన్ నా ప్రశ్నను విని ఉండరు. ఆయన కనెక్షన్ పోయి ఉండొచ్చు. అంతేకానీ, ఆయన అప్‌సెట్ అయ్యారని అనుకోవడం లేదు. అందుకు క్షమాపణలు’ అని వివరించారు.

అనంతరం ఆ వీడియోను స్వయంగా ఆయన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. హిలేరియస్‌గా ఉన్న ఆ వీడియో వైరల్ అవుతున్నది. అనంతరం, మరో ట్వీట్ చేసి తాను ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో రిపోర్ట్ చేస్తున్నారో వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios