హెయిర్ ట్రీట్మెంట్ ఫెయిల్: యువతి ఆత్మహత్య

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 3, Sep 2018, 11:59 AM IST
BBA student kills self over failed hair straightening treatm ..
Highlights

హెయిర్ స్టైల్ కోసం ఆ యువతి బ్యూటీ పార్లర్ కు వెళ్లింది. హెయిర్ ట్రీట్ మెంట్ చికిత్స చేయించుకుంది. బాగుండాల్సిన జుట్టు రోజురోజుకు ఊడిపోవడం మెుదలైంది.స్టైల్ గా ఉండాలని బ్యూటీపార్లర్ కు వెళ్తే ఉన్నజుట్టు ఊడిపోతుండటంతో మనోవేదనకు గురైంది. జుట్టు ఊడిపోవడం...స్నేహితులు గుచ్చి గుచ్చి అడగడంతో అవమానంగా భావించిన ఆ యువతి  ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో చోటు చేసుకుంది. 

కర్ణాటక :హెయిర్ స్టైల్ కోసం ఆ యువతి బ్యూటీ పార్లర్ కు వెళ్లింది. హెయిర్ ట్రీట్ మెంట్ చికిత్స చేయించుకుంది. స్టైల్ గా ఉండాలని బ్యూటీపార్లర్ కు వెళ్తే ఉన్నజుట్టు ఊడిపోతుండటంతో మనోవేదనకు గురైంది. రోజురోజుకి జుట్టు ఊడిపోవడం...స్నేహితులు గుచ్చి గుచ్చి అడగడంతో తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్ లో చోటు చేసుకుంది. 

మైసూర్ నగరానికి చెందిన నేహగంగమ్మ బీబీఏ చదువుతుంది. బాలెలి గ్రామం వద్ద ఉన్న గోకులంలోని పీజీ హాస్టల్ లో ఉంటూ చదువుకుంటుంది. అయితే నేహా తన హెయిర్ స్టైల్ కోసం బ్యూటీపార్లర్ కు వెళ్లింది. బ్యూటీపార్లర్ లో హెయిర్ ట్రీట్ మెంట్ చేయించుకుంది. అయితే హెయిర్ ట్రీట్మెంట్ శస్త్ర చికిత్స చేయించుకున్న తర్వాత నేహా జుట్టు ఊడిపోయింది. 

దీంతో పాటు ఆమెకు చర్మ సమస్యలు కూడా వచ్చాయి. స్నేహితులు జుట్టు ఊడిపోవడంపై పదేపదే ప్రశ్నించడంతో అవమానంగా ఫీలయ్యింది. మానసికంగా ఆందోళన చెందిన నేహ గంగమ్మ తాను ధర్మశాలకు వెళ్లి వెంట్రుకలు తీయించి ఏడాది పాటు కళాశాలకు వెళ్లలేనని తన తల్లి శైలకు ఫోన్ లో చెప్పింది. 

ఆ తర్వాత నేహా లక్ష్మణతీర్థ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. తనకు ఫోన్ చేసిన కుమార్తె ఆచూకీ లేకుండా పోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లక్ష్మణతీర్థ నదిలో గుర్తు తెలియని యువతి శవం లభించగా..దాన్ని తల్లిదండ్రులకు చూపించారు. ఆ శవం తమ కూతురి శవమని నేహా తల్లిదండ్రులు శైల, పెమ్మయ్యలు గుర్తించారు. 

బ్యూటీపార్లర్ నిర్వాకం వల్ల జుట్టు ఊడిపోవడంతో అవమానం తట్టుకోలేక నేహ ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు మైసూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బ్యూటీ పార్లర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.  

loader