Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై... మరోసారి లింగాయత్ వర్గానికే ముఖ్యమంత్రి పీఠం

కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై ఎంపికయ్యారు. బెంగళూరులో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో యడియూరప్ప వారసుడిగా బొమ్మైని ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు.

Basavaraj Bommai to be next Karnataka CM ksp
Author
Bangalore, First Published Jul 27, 2021, 7:48 PM IST

కర్ణాటక కొత్త సీఎంగా బసవరాజ్ బొమ్మై ఎంపికయ్యారు. లింగాయత్ సామాజిక వర్గానికే మరోసారి బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. బెంగళూరులో జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో యడియూరప్ప వారసుడిగా బొమ్మైని ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్ మాజీ సీఎం యడియూరప్ప సమక్షంలో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం సజావుగా సాగింది. 

2008లో బీజేపీలో చేరారు బసవరాజ్ బొమ్మై. 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. షిగ్గావ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎన్నికయ్యారు బసవరాజ్. కర్ణాటక మాజీ సీఎం ఎస్ఆర్ బొమ్మై కుమారుడే బసవరాజ్. జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు బసవరాజ్. మెకానికల్ ఇంజనీర్, పారిశ్రామిక వేత్తగా బొమ్మైకి గుర్తింపు వుంది. వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు బొమ్మై

మరోవైపు, కర్ణాటక కొత్త సీఎం రేసులో రాష్ట్ర  గనుల శాఖమంత్రి మురుగేశ్‌ నిరానీ, ఎమ్మెల్యే అరవింద్‌ బెల్లాట్‌,  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, డిప్యూటీ సీఎం అశ్వథ్‌ నారాయణ్‌, కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషీ, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ సునీల్‌ కుమార్‌ పేర్లు కూడా ప్రధానంగా వినిపించిన విషయం తెలిసిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios