Asianet News TeluguAsianet News Telugu

టిట్ ఫట్ ఫర్ టాట్ : న్యూఢిల్లీలోని యూకే హైకమీషన్ వద్ద బారికేడ్లను తొలగించిన భారత్

లండన్‌లోని భారత హైకమీషన్ కార్యాలయాల వెలుపల హింసాత్మక నిరసనలను కంట్రోల్ చేయకపోవడంపై సీరియస్ అయిన భారత్ యూకేపై ప్రతీకారం తీర్చుకుంది. న్యూఢిల్లీలోని బ్రిటీష్ హైకమీషన్, రాయబారి నివాసం వెలుపల భద్రతను తగ్గించడం ప్రారంభించింది.

barricades for security outside UK mission in new delhi removed ksp
Author
First Published Mar 22, 2023, 3:39 PM IST

యూకే సర్కార్‌పై కేంద్ర ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంది. ఈ వారాంతంలో లండన్‌లోని భారత హైకమీషన్ కార్యాలయాల వెలుపల హింసాత్మక నిరసనలను కంట్రోల్ చేయకపోవడంపై సీరియస్ అయిన భారత్ దెబ్బకు దెబ్బ తీసింది. బుధవారం న్యూఢిల్లీలోని బ్రిటీష్ హైకమీషన్, రాయబారి నివాసం వెలుపల భద్రతను తగ్గించడం ప్రారంభించింది. చాణక్యపురి డిప్లొమాటిక్ ఎన్‌క్లేవ్‌లోని శాంతిపథ్ వద్ద వున్న యూకే మిషన్ వెలుపల వుంచిన బారికేడ్‌లను, రాజాజీ మార్గ్‌లోని బ్రిటీష్ హైకమీషనర్ అలెక్స్ ఎల్లిస్ నివాసం వద్ద బుధవారం మధ్యాహ్నం వరకు బారికేడ్లను తొలగించినట్లుగా తెలుస్తోంది. 

ఆదివారం నుంచి లండన్‌లోని భారత హైకమీషన్ కార్యాలయం వెలుపల జరిగిన హింసాత్మక నిరసనపై యూకే ప్రభుత్వం చూసీచూడనట్లుగా వదిలివేయడంతో ఈ పరిణామం చోటు చేసుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఖలిస్తాన్ మద్ధతుదారుడు హైకమీషన్ బాల్కనీ పైకి ఎక్కి మన త్రివర్ణ పతాకాన్ని కిందకు లాగాడు. ఈ పరిణామాలపై భారత్‌లోని బ్రిటీష్ హైకమీషన్ ప్రతినిధి మాట్లాడుతూ.. తాము భద్రతా పరమైన విషయాలపై స్పందించమన్నారు. 

నిరసన ప్రారంభమైన గంటల తర్వాతకు కానీ లండన్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకోకపోవడంపై భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అప్పటికే ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తల చేస్తున్న నిరసన హింసాత్మకంగా మారే అవకావం వుందని బ్రిటీష్ ప్రభుత్వాన్ని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు ముందే హెచ్చరించాయి. అదే రోజు అర్ధరాత్రి ఈ పరిమాణాలపై వివరణ కోరేందుకు బ్రిటీష్ హైకమీషనర్ క్రిస్టినా స్కాట్‌ను భారత విదేశాంగ శాఖ పిలిపించింది. 

Also REad: లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయంపై ఖలిస్థాన్ అనుకూలవాదుల దాడి.. మండిపడ్డ భారత్...

ఖలిస్తాన్ అనుకూలవాదులు భారత హైకమీషన్ కార్యాలయంలోనికి ప్రవేశించేలా లోపాభూయిష్టమైన భద్రత వుండటం ఏంటని భారత్ ప్రశ్నించింది. అంతేకాదు.. నిరసనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని గుర్తించి, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి కఠినమైన చర్యలు తీసుకోవాలని.. వియన్నా కన్వెన్షన్‌ ప్రకారం నడుచుకోవాలని భారత్ యూకేకు మొట్టికాయలు వేసింది. ప్రత్యేకించి యూకేలోని భారత దౌత్య ప్రాంగణంలో తమ సిబ్బంది భద్రత పట్ల ఆ దేశ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని భారత్ ఫైర్ అయింది. 

అటు ఖలిస్తాన్ మద్ధతుదారులు శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంపైనా ఇండియా సోమవారం అమెరికాకు తన నిరసనను తెలియజేసిన సంగతి తెలిసిందే. గతంలో 2013లో వీసా మోసం ఆరోపణలపై న్యూయార్క్‌లోని భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగాడేను అరెస్ట్ చేయడంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి ప్రతిగా న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం వెలుపల వున్న బారికేడ్లను భారత ప్రభుత్వ వర్గాలు తొలగించాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios