తస్మాత్ జాగ్రత్త: షేవింగ్ చేయించుకున్న పాపానికి ఒకే గ్రామంలో 9 మందికి కరోనా!
ఒకరికి వాడిన కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన గుడ్డను మిగిలిన వారికి కూడా మంగలి వాడడంతో ఏకంగా 9 మంది కరోనా పాజిటివ్ గా తేలారు.
ఇంతకుమునుపు కటింగ్ చేపించుకోవడానికో, షేవింగ్ చేపించుకోవడానికో సలోన్ కి వెళితే.... మనం అక్కడ ఉన్న వారితో బ్లేడ్ మార్చమని చెప్పే వారము. రేజర్ ని కూడా డెట్టాల్ తో కడగమనే వారము. ఇదంతా మనం హెచ్ఐవి ఇన్ఫెక్షన్ భయానికి చేపించుకొనేవారం.
ఇక ఇప్పటినుండి క్షురకుడు ఉపయోగించే గుడ్డలను కూడా కొత్తవి ఉపయోగించమని చెప్పాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. ఒకరికి వాడిన కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన గుడ్డను మిగిలిన వారికి కూడా మంగలి వాడడంతో ఏకంగా 9 మంది కరోనా పాజిటివ్ గా తేలారు.
మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా అందరూ అవాక్కయ్యారు. గ్రామంలోని ఒక మంగలి అదే గుడ్డను ఉపయోగించి చాలామందికి షేవింగ్ చేసాడు. ఇలా షేవింగ్ చేయడంతో ఏకంగా 9 మంది ఈ వైరస్ బారిన పడ్డారు. రాత్రికి 6 గురు కరోనా పాజిటివ్ గా తేలారు. తెల్లారేసరికి మరో ముగ్గురుకి కూడా కరోనా వైరస్ సోకింది.
ఇలా వైరస్ సోకడంతో ఒక్కసారిగా అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామము మొత్తాన్ని సీల్ చేసేసారు. ఆ గ్రామంలోకి రాకపోకలను పూర్తిగా నిషేధించారు. ఒక రకంగా గ్రామం మొత్తాన్ని క్వారంటైన్ చేసేసారు.
ఇది ఇలా ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వణుకు పుట్టిస్తోంది. ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేయి దాటింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో తాజాగా 61 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరుకుంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ తో మరో ఇద్దరు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 31కి చేరుకుంది.
రాష్ట్రంలో 171 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 814గా ఉంది. గత 24 గంటల్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా 25 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కర్నూలు జిల్లాలో కొత్తగా 14 కేసులు నమోదయ్యాయి.
కర్నూలు జిల్లా మొత్తం 275 కేసులతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుంటూరు 209కేసులతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు కరోనా వైరస్ కు దూరంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలో 3 కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో మాత్రం కేసులు నమోదు కాలేదు. చిత్తూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో కొత్తగా కేసులేమీ నమోదు కాలేదు. కొంత వరకు ఈ మూడు జిల్లాలకు ఊరట లభించినట్లే.
కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ వల్ల అత్యధికంగా మంది మరణించగా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎనిమిదేసి మంది మరణించారు. అఅనంతపుూరం జిల్లాలో నలుగురు, నెల్లూరు జిల్లాలో ఇద్దరు మరణించారు.