కరోనా వైరస్‌తో వణికిపోతున్న దేశాలకు భారత్ తనకు చేతనైనంత సాయం చేస్తూనే వుంది. తాజాగా టీకా పంపిణీ విషయంలో తన ఉదారత చాటుకుంది

కరోనా వైరస్‌తో వణికిపోతున్న దేశాలకు భారత్ తనకు చేతనైనంత సాయం చేస్తూనే వుంది. తాజాగా టీకా పంపిణీ విషయంలో తన ఉదారత చాటుకుంది. తాజాగా కరీబియన్‌ దేశమైన బార్బడోస్‌కు ఇండియా వ్యాక్సిన్‌ను పంపింది.

సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారుచేసిన లక్ష కొవిషీల్డ్‌ డోసులను ఆ దేశానికి పంపింది. భారత్ తమ పట్ల చూపిన ఆదరాభిమానాలకు ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ దేశ ప్రధాని మియా మోట్లీ లేఖ రాశారు.

అందులో ‘‘ మీరు క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను. మాకు కొవిషీల్డ్‌ టీకాలను పంపి సహృదయతను చాటుకున్న భారత ప్రజలు, ప్రభుత్వానికి మా దేశ ప్రజలు, ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు.

ఇక్కడి వైద్యారోగ్య శాఖ మీరు పంపిన టీకా వినియోగానికి ఆమోదం తెలిపింది. తయారీదార్ల మార్గదర్శకాల ప్రకారం టీకా పంపిణీని ప్రారంభిస్తాం’’ అని మోట్లీ పేర్కొన్నారు.

అయితే చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే .. మరోవైపు భారత్‌లో సాగు చట్టాలకు సంబంధించి రైతులకు మద్ధతుగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్వీట్ చేసిన పాప్ సింగర్ రిహానా స్వదేశం బార్బడోస్‌ .

అయితే తమ దేశంపై ఆమె చేసిన వ్యాఖ్యలను భారత్‌ పట్టించుకోలేదు. ఎప్పటిలాగే తన ఉదారతను చాటుకుంది. బార్బడోస్‌ను కొవిడ్‌ నుంచి రక్షించేందుకు సిద్ధమైంది. ఆ దేశ ప్రధాని మియా మోట్లీ అభ్యర్థన మేరకు కరోనా టీకాలను పంపి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.