Asianet News TeluguAsianet News Telugu

బ్యాంకు నుంచి రూ. 34 కోట్లు చోరీ చేయాలనుకున్నారు.. ఆ డబ్బును మధ్యలోనే ఎందుకు వదిలేశారు?

ముంబయిలోని ఓ బ్యాంకులో దొంగతనం జరిగింది. రూ. 34 కోట్లు కనిపించకుండా పోయాయి. డబ్బు దాచిన రూమ్ నుంచి ఏసీ డక్టులు కిందకి వెళ్లేలా ఏర్పాట్లు ఉన్నాయి. దొంగలు రూ. 34 కోట్లను సంచుల్లో కుక్కి ఏసీ డక్టు గుండా కిందకి వెళ్లిపోయారు. కానీ, ఆ ఏసీ డక్టులో రూ. 22 కోట్ల డబ్బును వదిలేసి మిగతావి తీసుకుని వెళ్లిపోయారు.
 

bank robbers left cash in bags near bank run away with small chunk in mumbai
Author
Mumbai, First Published Jul 20, 2022, 12:06 AM IST

ముంబయి: మహారాష్ట్రలో ఓ బ్యాంకు దొంగతనం జరిగింది. బ్యాంకు నుంచి ఓ ముఠా రూ. 34 కోట్లు చోరీ చేయాలని భావించారు. పక్కా ప్లాన్‌తోనే వాల్ట్ రూమ్‌లో అడుగు పెట్టారు. ఆ డబ్బును మొత్తం బ్యాగుల్లో కుక్కి సర్దారు. వాటిని ఏసీ డక్టులో వేశారు. అయితే, కింద ఆ డక్టులో నుంచి మొత్తం డబ్బును తీసుకొని పారిపోలేదు. రూ. 12.20 కోట్లు తీసుకుని, సంచుల్లో కుక్కిన సుమారు రూ. 22 కోట్ల డబ్బును ఆ ఏసీ డక్టులోనే వదిలిపెట్టి పారిపోయారు.

మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఓ బ్యాంకు చోరీ చోటుచేసుకుంది. డొంబివిలీలోని ఓ ప్రైవేటు బ్యాంకు మనపదా బ్రాంచ్‌లో ఈ ఘటన జరిగింది. ఈ నెల రెండో శనివారం 9వ తేదీ, 10వ తేదీల్లో సెలవు తర్వాత జులై 11వ తేదీన ఆ బ్యాంక్ రీఓపెన్ అయింది. బ్యాంకులోని క్యాష్ చెస్ట్ నుంచి రూ. 34.20 కోట్లు మిస్ అయినట్టు 11వ తేదీనే వెలుగులోకి వచ్చింది. అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే సీసీటీవీ చెక్ చేశారు. కానీ, అవి ట్యాంపర్ చేసి ఉన్నాయి. అక్కడే ఆ వాల్ట్ నుంచి వెళ్తున్న ఏసీ డక్ట్ డ్యామేజీ అయి ఉండటాన్ని పోలీసులు గమనించారు. 

ఆ ఏసీ డక్ట్‌ను మరింత పరిశీలించగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అందులో కింది భాగాన ఏడు సంచులు కనిపించాయి. అందులో రూ. 22 కోట్ల డబ్బు ఉన్నది. దొంగిలించిన డబ్బును ఇలా మార్గం మధ్యలో ఏసీ డక్టులో సంచుల్లో ఉంచి వెళ్లిపోవడంపై అందరూ ఆశ్చర్యపోయారు. బహుశా ఏసీ డక్టు గుండా ప్రయాణించడంతో వారి కాళ్లు కోల్డ్ కారణంగా సహకరించకపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. లేదా వాటిని తీసుకెళ్లడానికి తగిన ఏర్పాట్లు లేక.. లాజిస్టిక్ సమస్య కూడా ఉండొచ్చని భావిస్తున్నారు.

ఆ క్యాష్ వాల్ట్‌కు ఇంచార్జీగా అల్తాఫ్ షేక్ ఉన్నారని బ్యాంకు అధికారులు తెలిపారు. కానీ, ఆ రోజు బయటకు వెళ్లి టీ తాగి వస్తానని చెప్పిన అల్తాఫ్ షేక్ మళ్లీ తిరిగి రాలేదని వివరించారు. పోలీసులు ఇప్పటికే షేక్ సహా ఇతర ఆయన అనుచరులను పోలీసులు అరెస్టు చేశారు.

ముందుగా సేకరించిన సమాచారం ఆధారంగా పోలీసులు ట్రాప్ చేసి ఇస్రార్ అబ్రార్ హుస్సేన్ ఖురేషీ, శంషాద్ అహ్మద్ రియాజ్ అహ్మద్ ఖాన్, అనూజ్ ప్రేమ్ శంకర్ గిరిలను ముంబ్రాలో పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 5.80 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. రూ. 10 లక్షల ప్రాపర్టీని రికవరీ చేసుకున్నారు.

అరెస్టు చేసిన వారందరినీ విచారిస్తే మరింత సమాచారం వెలుగులోకి రానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios