Asianet News TeluguAsianet News Telugu

వైరల్ వీడియో: ముంబయి వీధుల్లో బ్యాంక్ అధికారులు.. కస్టమర్ల కోసం మైక్ పట్టుకుని వేట

బ్యాంకు అధికారులు మెగా ఫోన్ పట్టుకుని వీధుల్లో తిరుగుతున్న వీడియో వైరల్ అవుతున్నది. కెనరా బ్యాంకు అధికారులు డిపాజిటర్ల కోసం చేస్తున్న ప్రచారం చర్చనీయాంశం అవుతున్నది. ఈ సందర్భంగా క్రెడిట్ గ్రోత్ అనే అంశంపై విశ్లేషణలు వస్తున్నాయి.
 

bank officers in mumbai streets for attracting depositors as credit growth surges
Author
First Published Nov 3, 2022, 5:08 PM IST

ముంబయి: నగదు డిపాజిట్ చేసుకోవాలని, అందుకు తాము అందిస్తున్న గొప్ప ఆఫర్లు ఇవీ అంటూ బ్యాంకు అధికారులు వీధుల్లో మైక్ సెట్లు పట్టుకుని తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా బ్యాంక్ ఉద్యోగులు ఇలా మార్కెటింగ్ టీమ్ వలే వీధుల్లో తిరగడం చూడటం అరుదు. అదీ మెగాఫోన్‌లు చేతపట్టుకుని తమ బ్యాంకు అందిస్తున్న ఆఫర్లు ప్రకటిస్తూ కస్టమర్ల కోసం తిరగడం అనేది దాదాపు జరగదు. కానీ, ముంబయిలో కెనరా బ్యాంకు అధికారులు ఈ పని చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

లోన్ డిమాండ్లు పెరగడమే ఇందుకు కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఆర్బీఐ వివరాల ప్రకారం, లోన్ క్రెడిట్ ఐదేళ్ల యావరేజీ 9.7 శాతం ఉండగా.. నేడు ఈ వార్షిక క్రెడిట్ గ్రోత్ 17.95 శాతం (అక్టోబర్ వరకు) ఉన్నట్టు వివరించారు. అదే స్థాయిలో డిపాజిట్లు పెరగలేదు. దీంతో లిక్విడిటీ కొరత ఏర్పడింది. ఈ లోటు పూడ్చుకోవడానికే డిపాజిటర్లు, ఫిక్స్‌డ్ డిపాజిటర్ల కోసం బ్యాంకు ఉద్యోగాలు ఆపసోపాలు పడుతున్నారు. బ్యాంకు డిపాజిట్ల ఐదేళ్ల యావరేజీ 9.4 శాతం ఉన్నది. కానీ, డిపాజిట్ కలెక్షన్లు మాత్రం ఇంకా ఈ యావరేజీని కూడా తాకలేదు. కానీ, ద్రవ్యోల్బణం 7.4 శాతానికి పెరగడంతో డిపాజిట్లపై రాబడి ప్రతికూలంగా మారిపోయాయి.

కరోనా సమయంలో డిపాజిట్లతో ఏర్పడ్డ లిక్విడిటీనే ప్రస్తుత లోన్ క్రెడిట్‌కు వినియోగించుకుంటున్నాయని క్రిసిల్ అధికారి క్రిష్ణన్ సీతారామన్ తెలిపారు. 

డిపాజిట్లు పెంచడానికి ఇంటెరెస్ట్ రేట్లు కూడా పెంచుతున్నారు. ఎస్బీఐ కూడా గడిచిన 30 రోజుల్లో కొన్ని డిపాజిట్ల ప్లాన్‌లలో ఏకంగా 60 బేసిస్ పాయింట్లు పెంచినట్టు ఆ బ్యాంకు వెబ్ సైట్ ద్వారా తెలుస్తున్నది. 

Also Read: డిజిటల్ రూపీ తొలి రోజూ ట్రాన్సాక్షన్స్ విలువ రూ. 275 కోట్లు, త్వరలోనే సాధారణ ప్రజలకు సైతం లభ్యం..

ఏది ఏమైనా బ్యాంకులు క్రెడిట్ గ్రోత్‌ను తగ్గకుండా చూస్తాయని నిపుణులు భావిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఈ గ్రోత్ కనిపిస్తున్న మూలంగా దాన్ని స్థిరంగా నిలబెట్టడానికి శాయశక్తుల ప్రయత్నిస్తాయని డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్ లిటమిటెడ్ లీడ్ అనలిస్ట్ ప్రీతేష్ బంబ్ తెలిపారు.

దేశంలోని ఆరు పెద్ద బ్యాంకుల్లో ఐదు బ్యాంకులు చివరి త్రైమాసికంలో నిపుణులు ఊచించిన దానికి సరిపోయేలా లేదంటే అంతకు మించిన సంపదను సృష్టించాయి. ఈ సంపద లోన్‌లపై వచ్చిన ఆదాయం మూలంగా ఏర్పడిందే అని వారు చెబుతున్నారు. మార్చి చివరి వరకు డిపాజిట్ల కంటే లోన్ గ్రోత్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉ్నాయని బ్లూమ్‌బర్గ్ ఇంటెలిజెన్స్ అనలిస్టు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios