గత రెండు నెల క్రితం పుల్వామాలోని జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ నుంచి ఏటీఎంను దొంగిలించబడింది.  పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఎట్టకేలకు చోరీకి పాల్పడిన ముగ్గురు దొంగలను కనిపెట్టింది. వారిని బంగ్లాదేశ్ పౌరులుగా గుర్తించారు.  

గత రెండు నెలల క్రితం పుల్వామాలోని జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ నుంచి ఏటీఎంను దొంగిలించబడింది. పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఎట్టకేలకు చోరీకి పాల్పడిన ముగ్గురు దొంగలను కనిపెట్టింది. ఏటీఎంను దొంగిలించిన ముగ్గురు బంగ్లాదేశ్ పౌరులను అరెస్టు చేశారు. పాతిపెట్టిన ఏటీఎం మిషన్ ను బయటకు తీశారు. అనంతరం ఆ మెషీన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకెళ్తే... పుల్వామా జిల్లాలోని జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్‌కు చెందిన ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ఏటీఎం)ని దొంగలు అపహరించారు. ఏప్రిల్ 7 మరియు 8 మధ్య రాత్రి పుల్వామా నగరంలోని బాయ్స్ డిగ్రీ కళాశాల సమీపంలోని ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ ATM లోకి దొంగలు ప్రవేశించారు. డబ్బుతోపాటు ఏటీఎంను కూడా ఎత్తుకెళ్తారు దుండగులు. ఈ ఘటనపై పుల్వామా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ పూటేజ్ ఆధారంగా ముగ్గురూ దుండగులు ఆ ఏటీఎంను దొంగిలించినట్టు పోలీసులు గుర్తించారు. పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం ఎట్టకేలకు దొంగలను కనిపెట్టింది.

విచారణ సమయంలో పోలీసు బృందం డిజిటల్ డేటా సాక్ష్యాలను విశ్లేషించింది. సందర్భోచిత సాక్ష్యాల దర్యాప్తుతో పాటు, అనుమానితులను దర్యాప్తు చేయడం ద్వారా బంగ్లాదేశ్ కు చెందిన అంతర్జాతీయ దొంగల ముఠానే ఈ చోరీకి పాల్పడినట్టు పోలీసు ప్రతినిధి తెలిపారు. నిందితులు గతంలో కూడా ఇలాంటి నేరాలకు పాల్పడ్డారని, నిందితులను సుమన్ మాల్, ఫరూఖ్ అహ్మద్ అలీ, మొహమ్మద్ ఇబ్రహీం లనీ, వీరందరూ బంగ్లాదేశ్ జాతీయులుగా గుర్తించారు.

విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడని పోలీసులు తెలిపారు. దొంగిలించబడిన ATM మిషన్ ను దోగం కాకపోరా వద్ద ఒక గొయ్యిలో పాతిపెట్టారనీ, చోరీకి గురైన ఏటీఎంను బయటకు తీయడానికి బుల్డోజర్ లను ఉపయోగించినట్టు తెలిపారు. విచారణలో ఈ దొంగల ముఠా గతంలో కూడా పలు ప్రాంతాల్లో ఇటువంటి ATM చోరీలకు పాల్పడినట్లు వెల్లడించిందని పోలీసులు వెల్లడించారు.