తృణముల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు ఓ సినీ నటుడిని దేశం నుంచి గెంటేశారు. ఈ సంఘటన కోల్ కత్తాలో చోటుచేసుకుంది. 

ఇంతకీ అసలు మ్యాటరేంటంటే.. ఫిర్దోస్ అహ్మద్ బంగ్లాదేశ్ కి చెందిన సినీ నటుడు. ఆయన షూటింగ్ నిమిత్తం భారత్ కి వచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన కోల్ కత్తాలో తృణముల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో.. ఆయనపై కేంద్రంలోని బీజేపీ.. ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసింది.

రూల్స్ ప్రకారం విదేశీయులు ఎవరూ దేశంలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు. ముఖ్యంగా టూరిస్ట్ వీసా మీద వచ్చినవారికి అసలు చేయకూడదు.. ఈ నియమాన్ని ఫిర్దోస్ అహ్మద్ ఉల్లంఘించారు. దీంతో.. ఆయనను తిరిగి వారి దేశానికి వెళ్లాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.

ఆయనకు జారీచేసిన వీసాను కూడా రద్దు చేశారు. అతని పేరును కేంద్రం బ్లాక్ లిస్టులో చేర్చింది. ఈ క్రమంలో భవిష్యత్తులో ఫిర్దోస్ భారత్ లో అడుగుపెట్టడం కూడా కష్టమే.