బెంగుళూరు: కర్ణాటక మాజీ సీఎం ధరమ్ సింగ్ బంధువు  సిద్దార్ధ్ సింగ్  దారుణ హత్యకు గురయ్యాడు. ఏపీ రాష్టంలోని నెల్లూరు జిల్లా రావూరులో  మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. సిద్దార్ధ్ సింగ్ మృతదేహాన్ని వెలికితీసేందుకు బెంగుళూరు పోలీసులు రావూరుకు చేరుకొన్నారు.

కర్ణాటక రాష్ట్ర మాజీ సీఎం ధరమ్ సింగ్ సమీప బంధువు సిద్దార్ధ్ సింగ్ ను కొందరు దుండగులు హత్య చేశారు.  ఆర్ధిక లావాదేవీల కారణంగానే సిద్దార్ద్ సింగ్ ను హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు.

రావూరు అటవీ ప్రాంతం గుండవోలు సిద్దార్ద్ సింగ్ మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్టుగా నిందితులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వినోద్ అనే నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రావూరు చేరుకొన్నారు. వినోద్ ది రావూరు వాసిగా పోలీసులు గుర్తించారు.

ఆర్ధిక లావాదేవీలే కారణంగా పోలీసులు గుర్తించారు. బెంగుళూరు పోలీసులు ఇప్పటికే రావూరు చేసుకొని సిద్దార్ద్ సింగ్ మృతదేహన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.