Asianet News TeluguAsianet News Telugu

అంతర్జాతీయ విమానాల రాకపోకలపై జూలై 31 వరకు నిషేధం

అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఈ నెల 31వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగిస్తూ శుక్రవారం నాడు డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది.

Ban On International Flights Extended Till July 31
Author
New Delhi, First Published Jul 3, 2020, 4:16 PM IST


న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఈ నెల 31వ తేదీ వరకు నిషేధాన్ని పొడిగిస్తూ శుక్రవారం నాడు డీజీసీఏ ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా ఆన్ లాక్ 2 ప్రక్రియలో భాగంగా పలు రంగాలపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తుంది ప్రభుత్వం. అయితే దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగించింది ప్రభుత్వం.

కార్గో విమానాలకు మాత్రం ఈ నిషేధం నుండి మినహాయింపు ఇస్తున్నట్టుగా డీజీసీఏ ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 26వ తేదీన అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని జూలై 15వ తేదీ వరకు విధిస్తున్నట్టుగా డీజీసీఏ ప్రకటించిన విషయం తెలిసిందే.

కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఈ నెలాఖరువరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధాన్ని పొడిగిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది డీజీసీఏ.

Also read:అంతర్జాతీయ విమాన సర్వీసులపై జూలై 15 వరకు నిషేధం: డీజీసీఏ

వందే భారత్ మిషన్ కింద ఎయిరిండియా, ఇతర ప్రైవేట్ దేశీయ విమానాలు ఈ ఏడాది మే 6వ తేదీ నుండి ఇతర దేశాల్లోని భారతీయులను ఇండియాకు తీసుకొచ్చేందుకు నడుస్తున్నాయి.

దేశంలో డొమెస్టిక్ విమానాలు ఈ ఏడాది మే 25వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. రెండు మాసాల లాక్ డౌన్ తర్వాత డొమెస్టిక్ విమానాల రాకపోకలు ప్రారంభించారు. సోషల్ డిస్టెన్సింగ్ కఠినమైన నిబంధనల మధ్యలో డొమెస్టిక్ విమానాల రాకపోకలు ప్రారంభించింది డీజీసీఏ.
 

Follow Us:
Download App:
  • android
  • ios