బలూచ్ ఫైటర్స్ 10 మంది పాకిస్తానీ సైనికులను హతమార్చారు: క్వెట్టాలోని మార్గట్ ప్రాంతంలో సైనిక కాన్వాయ్‌పై జరిగిన దాడికి బిఎల్‌ఎ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. రిమోట్‌తో నియంత్రించే పేలుడు పదార్థంతో సైనిక వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేశారు.
బలూచ్ ఫైటర్స్ 10 మంది పాకిస్తానీ సైనికులను హతమార్చారు. పాకిస్తాన్‌లోని క్వెట్టా సమీపంలో జరిగిన ఘోర దాడిలో బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైనిక కాన్వాయ్‌పై దాడి చేసింది. దీనికి తమదే బాధ్యత అని బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఈ దాడి మార్గట్ ప్రాంతంలో జరిగింది. రిమోట్‌తో నియంత్రించే పేలుడు పదార్థంతో సైనిక వాహనాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. బిఎల్‌ఎ అధికారిక ప్రకటన ప్రకారం, ఈ పేలుడులో పాకిస్తాన్ సైన్యానికి చెందిన 10 మంది సైనికులు మరణించారు.
పత్రికా ప్రకటనలో ఈ దాడిని ధృవీకరించారు
బిఎల్‌ఎ ప్రతినిధి జియాండ్ బలూచ్ ఒక పత్రికా ప్రకటనలో ఈ దాడిని ధృవీకరించారు. ఈ ప్రాంతంలో స్థావరాలను ఏర్పాటు చేసుకున్న సైన్యంపై బలూచ్ యోధులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన అన్నారు. బలూచిస్తాన్‌లో తమ పోరాటంలో ఇది ఒక భాగమని బిఎల్‌ఎ పేర్కొంది. ఇదిలా ఉంటే గత నెలలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రైలును హైజాక్ చేసిన విషయం తెలిసిందే. బోలాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసి 339 మంది ప్రయాణికులను బందించిన విషయం తెలిసిందే.
ఈ ఘటనతో పాక్ కు తగిన బుద్ధి జరిగిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోస్తున్న పాకిస్థాన్ కు తగిన శాస్తి జరుగుతోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పాకిస్థాఆర్థిక వ్యవస్థ అత్యంత దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ కు మరింత కష్ట కాలం మొదలైంది. భారత్ అవలంభిస్తోన్న విధానంతో పాక్ ఉక్కిరిబిక్కిరవుతోంది.
