Asianet News TeluguAsianet News Telugu

సరిహద్దులో తీవ్రమవుతున్న ఉగ్ర చర్యలు..  పంజాబ్‌లో పాకిస్థానీ బెలూన్‌ను గుర్తించిన బీఎస్ఎఫ్..

పాకిస్థాన్ ఉగ్రచర్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. తాజాగా ఫిరోజ్‌పూర్‌లో పాకిస్థానీ బెలూన్‌ను బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. ఫిరోజ్‌పూర్‌లోని గురుహషాయ్‌లోని బహదూర్ సరిహద్దు అవుట్‌పోస్ట్ సమీపంలో బీఎస్ఎఫ్ కు చెందిన 160వ బెటాలియన్‌కు చెందిన సైనికులు పాకిస్తాన్ బెలూన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Balloon from Pakistan recovered in Punjab's Ferozepur
Author
First Published Nov 26, 2022, 6:20 PM IST

పాకిస్థాన్ ఉగ్రచర్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. అక్రమంగా భారత సరిహద్దులోకి చొరబడే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన సైన్యం.. పాక్ ఉగ్ర కార్యకలాపాలపై నిఘా పెట్టింది. పొరుగు దేశం అనుసరించే నీచమైన తిప్పికొడుతోంది. పంజాబ్‌లోని రెండు వేర్వేరు జిల్లాల్లో రెండు రోజుల్లో.. కొన్ని డ్రోన్లు, మరికొన్ని సార్లు కార్టూన్ క్యారెక్టర్ ఆకారంలో ఉన్న బెలూన్ తిరిగినట్టు గుర్తించారు. సరిహద్దులో డ్రోన్ కదలికలను గుర్తించిన బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు ప్రారంభించడంతో పాక్ వైపుకు వెళ్లిపోయింది. అనంతరం ఎగురుతున్న ఓ బెలూన్‌ ను సైనికులు గుర్తించారు. దానిని పట్టుకుని పరిశీలించగా.. దానికి  పాకిస్థానీ నోటు, ఓ కాగితం ఉండటం గమనించారు. ఆ కాగితంలో ఫోన్ నెంబర్ ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుతం ఈ రెండు కేసులను సరిహద్దు సైనికులు విచారిస్తున్నారు. 
  
మొదటి  ఘటనలో డ్రోన పట్టుబడింది. ఈ ఘటన నవంబర్ 25 శుక్రవారం నాడు బీఎస్ఎఫ్ సిబ్బంది డ్రోన్ పట్టుకున్నారు. పంజాబ్ జిల్లాలోని అమృత్‌సర్‌ జిల్లాకు 34 కిలోమీటర్ల దూరంలోని దవోకే గ్రామం సమీపంలో శుక్రవారం సాయంత్రం పెట్రోలింగ్ చేస్తున్న బీఎస్‌ఎఫ్ సిబ్బందికి డ్రోన్ శబ్ధం వినిపించింది. వెంటనే చర్యలు తీసుకున్న జవాన్లు దానిపై కాల్పులు జరిపి ధ్వంసం చేశారు. కాల్పుల ఘటన తరువాత.. దెబ్బతిన్న డ్రోన్ ను  స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అది క్వాడ్‌కాప్టర్ DGI మ్యాట్రిక్స్ 300 RTK (చైనీస్ డ్రోన్) అని తేలింది. ఇది  4 రోటర్లతో కూడిన మానవరహిత డ్రోన్ అని BSF అధికారులు తెలిపారు. ఘటనతో అప్రమత్తమైన అధికారులు గాలింపు చర్యలను ముమ్మారం చేశారు.  

రెండవ  ఘటన నవంబర్ 26వ తేదీ (శనివారం) జరిగింది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో పొరుగున ఉన్న పాకిస్థాన్ నుంచి భారత సరిహద్దులోకి ప్రవేశించిన కార్టూన్ ఆకారపు బెలూన్‌ను బీఎస్‌ఎఫ్ సిబ్బంది శనివారం స్వాధీనం చేసుకున్నారు. గురిషాయ్‌లోని బహదూర్ సరిహద్దు ఔట్‌పోస్టు సమీపంలో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) 160 బెటాలియన్ సిబ్బంది బెలూన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. బెలూన్ గురించి సమాచారం ఇస్తూ.. బెలూన్‌లో కార్టూన్ క్యారెక్టర్‌ను తయారు చేసినట్లు, అలాగే 10 రూపాయల పాకిస్తానీ కరెన్సీ నోటు జతచేయబడిందని BSF అధికారులు తెలిపారు. దీంతో పాటు ఓ పేపర్‌ను కూడా అతికించారు. ఈ పేపర్‌లో మొబైల్ నంబర్ కూడా రాసి ఉందని తెలిపారు. ఈ ఫోన్ నెంబర్ ఎవరిదనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. మన సైన్యం ఉగ్ర కార్యకలాపాలపై ఓ కన్నేసి ఉంచేందుకు లేదా వారికి హాని కలిగించేందుకు పాకిస్థాన్ ఇలా చేయడం ఇదే తొలిసారి అని తెలుసుకోవాలి. పొరుగు దేశాలు ప్రతిరోజూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటాయి. దీంతో జవాన్లు వెంటనే స్పందించారు.

Follow Us:
Download App:
  • android
  • ios