Bajrang Dal activist Murdered:  ప్రశాంతంగా కర్ణాటక భ‌గ్గుమంటుంది. గ‌త కొంత కాలంగా.. ఏదోక వివాదంతో  అట్టుడికిపోతోంది. తాజాగా శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష (23) హత్యతో భగభగలాడుతోంది. ఈ త‌రుణంలో త‌న కొడుకును ముస్లిం దుండ‌గులే..హ‌త్య చేశార‌ని హ‌ర్ష తండ్రి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 

Bajrang Dal activist Murdered: ప్రశాంతంగా కర్ణాటక భ‌గ్గుమంటుంది. గ‌త కొంత కాలంగా.. ఏదోక వివాదంతో అట్టుడికిపోతోంది. తాజాగా.. శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష (23) హత్యతో భగభగలాడుతోంది. ప్రస్తుతం అక్క‌డ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయాందోళనలో స్థానికులు ఉన్నారు. భజరంగ్ దళ్ కార్యకర్త తన ఫేస్‌బుక్ లో హిజాబ్‌కు వ్యతిరేకంగా పోస్ట్ చేశాడనే నెపంతో.. గ‌త రెండు రోజుల క్రితం భారతి కాలనీలో హర్షను మారణాయుధాలతో వెంటాడి.. అత్యంత దారుణంగా క‌త్తుల‌తో పొడిచి హతమార్చారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 

హర్ష హత్యను ఖండిస్తూ బజరంగ దళ్‌, బీజేపీ కార్యకర్తలు, ఇతర హిందూ సంఘాల ప్రతినిధులు నిరసన ప్రదర్శన చేశారు. ఈ క్ర‌మంలో హిందూ, ముస్లీం వర్గాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కొంది. గుంపును అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో నగరమంతటా 144వ సెక్షన్‌ విధించారు.

ఈ హత్యపై కర్ణాటక గ్రామీణాభివృద్ధి మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లిం గూండాలే ఈ దుశ్చర్యకు పాల్ప‌డ్డార‌నీ, హర్షను వారే హత్య చేశారని ఆరోపించారు. అంతేకాదు, ఈ హత్య వెనుక కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఉన్నారని ఆయన ఆరోపణలు చేశారు. హిజాబ్ నిరసనలు ఉధృతంగా ఉన్న సమయంలో హర్ష చేసిన వ్యాఖ్యలతో డీకే హత్యకు ప్రేరేపించారని మంత్రి ఆరోపించడం గమనార్హం. 

ఈ త‌రుణంలో త‌న కొడుకును ముస్లిం దుండగులే హత్య చేశారని భజ‌రంగ్ ద‌ళ్ కార్య‌క‌ర్త‌ హర్ష తండ్రి ఆరోపించారు. త‌న కొడుకు చాలా క్రియ‌శీల‌కంగా ప‌నిచేసేవాడ‌నీ, ఆ అక్క‌సుతోనే తన కొడుకుపై కుట్ర‌ప‌న్నారనీ, గ‌త ఐదేండ్లుగా త‌న కొడుకును హ‌త్య చేయాల‌ని ఫ్లాన్ చేశార‌ని, ముస్లిం దుండగులు హత్య చేశారని హర్ష తండ్రి ఆరోపించారు. ఈ క్ర‌మంలో ఫిబ్రవరి 20 ఆదివారం నాడు హర్ష హత్య చేశారు. హర్ష తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివమొగ్గలోని దొడపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

హర్ష గత ఐదేళ్లుగా భజరంగ్ దళ్ కార్యకర్తగా ప‌నిచేస్తున్నాడు. అతను గోహత్యకు వ్యతిరేకంగా కార్యాచరణలో క్రియ‌శీల‌కంగా పాల్గొన్నాడు. ఆ త‌రుణంలో చాలా మంది ముస్లిం యువకులు త‌న కొడుకుపై క‌క్ష్య పెంచుకున్నార‌ని హ‌ర్ష‌ తండ్రి ఆరోపించారు. సమీప ప్రాంతంలోని ముస్లింల నుంచి హర్షకు బెదిరింపులు వస్తుండేవ‌నీ, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించేవారిని తెలిపారు. 

ఫిబ్రవరి 20న రాత్రి 8 గంటల సమయంలో హోటల్‌లో భోజనానికి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరాడు. 9.30 గంటలకు కామత్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలోని ఎన్‌టీ రోడ్డులో హర్షపై కొందరు ముస్లిం దుండగులు మారణాయుధాలతో దాడి చేశారని త‌మ‌కు ఫోన్‌ వచ్చిందని తండ్రి తెలిపారు. వెళ్లి చూసే స‌రికి.. హర్ష ఆసుపత్రిలో రక్తపు మడుగులో పడి ఉన్నాడనీ, ముస్లిం దుర్మార్గులే త‌న కొడుకును హత్య చేసారని ఆరోపించారు.