Asianet News TeluguAsianet News Telugu

భార్య ఆత్మహత్య వీడియో : ఇలాంటి చార్జిషీటును ఇంతవరకు చూడలేదు.. సీజేఐ జస్టిస్ రమణ వ్యాఖ్య

సైనికుడు వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా సొంత భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపే ప్రయత్నమైనా చేయకుండా వీడియోలో చిత్రీకరించడాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్ ల ధర్మాసనం తప్పుపట్టింది. 

Bail plea citing weak evidence lands accused in trouble, SC favours transfer of case
Author
Hyderabad, First Published Aug 6, 2021, 11:08 AM IST

ఢిల్లీ : ఛార్జిషీటులో పేర్కొన్న సాక్ష్యాలు బలంగా లేవనే కారణంతో బెయిల్ పొదాలని ప్రయత్నించిన ఓ సైనికుడి ప్రయత్నం సుప్రీంకోర్టులో బెడిసికొట్టింది. కేసులో పోలీసుల దర్యాప్తు తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అనుమానాలు వ్యక్తం చేసింది.

దీనిని స్వతంత్ర దర్యాప్తు సంస్థకు బదిలీ చేసే అవకాశాన్ని పరిగణనలో తీసుకోవాలని రాజస్థాన్ ప్రభుత్వానికి సూచించింది. సైనికుడు వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడమే కాకుండా సొంత భార్య ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపే ప్రయత్నమైనా చేయకుండా వీడియోలో చిత్రీకరించడాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ట ఎన్.వి.రమణ, జస్టిస్ సూర్యకాంత్ ల ధర్మాసనం తప్పుపట్టింది. 

రాజస్థాన్ హైకోర్టు తనకు బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా దనిని సీజేఐ ధర్మాసనం గురువారం విచారించింది. తన న్యాయవాడ వృత్తి జీవితంలో ఇలాంటి ఛార్జిషీటును ఇంతవరకు చూడలేదని జస్టిస్ రమణ వ్యాఖ్యానించారు. రాజస్థాన్ లోని అల్వార్ కు చెందిన సాహాబుద్దీన్ అనే సైనికుడు ఒక చిన్న తగాదాతో తన భార్య ఆత్మహత్యకు కారకుడైనట్లు అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు. 

స్వయానా నిందితుని కుమార్తె ఇచ్చిన వాంగ్మూలం కూడా అతని ప్రమేయాన్ని చాటుతోందని, కీలక నిందితుల వాంగ్మూలాలు నమోదు చేసేవరకు బెయిల్ పిటిషన్ ను అనుమతించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. పిటిషన్ ను వెనక్కి తీసుకునే అవకాశాన్ని పిటిషనర్ తరఫు న్యాయవాదికి ఇవ్వలేదు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios