రాజ్యసభ ఎన్నికల్లో మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వం అనుకున్న విధంగా సీట్లు గెలవలేకపోయింది. కేవలం మూడు స్థానాల వద్దే ఆగిపోయింది. బీజేపీ మాత్రం తన పట్టును కొనసాగించింది. మొదటి నుంచి మూడు స్థానాలు గెలవాలని భావించిన కమలదళం తన లక్ష్యాన్ని చేరుకుంది.
మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం ఎంవీఏకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శివసేనపై వరుస పోరులో బీజేపీ మూడో సీటునూ గెలుచుకుంది. దీంతో రాష్ట్రంలోని ఆరు రాజ్యసభ స్థానాలు రెండు భాగాలుగా చీలిపోయాయి అధికార కూటమికి మూడు సీట్లు రాగా.. ప్రతిపక్ష బీజేపీకి కూడా మూడు స్థానాలు గెలుచుకుంది. దీంతో ఈ విడతలో రాజ్యసభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కొనసాగించిన జోరును మహారాష్ట్రలోనూ బీజేపీ కొనసాగించింది.
Prophet Row : ప్రయాగ్ రాజ్, ఇతర నగరాల్లో హింసాత్మక నిరసనలకు పాల్పడిన 109 మంది అరెస్ట్
బీజేపీ మూడు స్థానాల్లో విజయం సాధించడం పట్ల ఆ పార్టీ నాయకుడు, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర పడ్నవీస్ స్పందించారు. ‘‘ఎన్నికలు కేవలం పోరాటం కోసమే కాకుండా విజయం కోసం పోటీపడుతున్నాయి. జై మహారాష్ట్ర’’ ట్వీట్ చేశారు. కాగా 23 ఏళ్ల తరువాత మహారాష్ట్రలో రాజ్యసభ ఎన్నికలు జరిగాయి. గత ప్రభుత్వాల హయాంలో అన్ని ఏకగ్రీవం అయ్యేవి. అయితే రాష్ట్రంలో ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడంతో ఇలా ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది.
Prophet Row : నూపుర్ శర్మను ఉరితీయాలి - ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్
క్రాస్ ఓటింగ్, బీజేపీ, అధికార కూటమి నిబంధనల ఉల్లంఘనపై టిట్-ఫర్-టాట్ ఫిర్యాదుల నేపథ్యంలో మహారాష్ట్రలో రాజ్యసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు దాదాపు ఎనిమిది గంటల తరువాత అంటే శనివారం తెల్లవారుజామున పూర్తయ్యింది. అంతకు ముందు క్రాస్ ఓటింగ్ జరిగిందని ఆరోపిస్తూ, ఆ ఓట్లను అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ బీజేపీ, శివసేన వెళ్లి ఎన్నికల కమిషన్ ను కలిశాయి. అధికార కూటమికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు వేసిన ఓట్ల చెల్లుబాటును బీజేపీ ప్రశ్నించింది. అయితే మహా వికాస్ అఘాడీ కూడా రెండు ఓట్లను చెల్లుబాటును ఎన్నికల కమిషన్ ముందుకు తీసుకెళ్లింది. ఇందులో ఒక బీజేపీ ఎమ్మెల్యే ఓటు ఉండగా.. మరొకటి స్వతంత్ర అభ్యర్థి ఓటు ఉంది.
ఎన్ సీపీకి చెందిన జితేంద్ర అవద్, కాంగ్రెస్‌కు చెందిన యశోమతి ఠాకూర్, శివసేనకు చెందిన సుహాస్ కాండే, బీజేపీకి చెందిన సుధీర్ ముంగంటివార్, స్వతంత్ర ఎమ్మెల్యే రవి రాణాపై వేసిన ఓట్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే సుహాస్ కాండే తప్ప మిగిలిన అన్ని ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. కాండే తన బ్యాలెట్‌ను మరెవరికీ చూపించలేదు, అయినా అతడి ఓటు చెల్లుబాటు కాలేదని NCP ఎన్నికల ఇన్‌ఛార్జ్ జయంత్ పాటిల్ ఆరోపించారని వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
అయితే శనివారం తెల్లవారుజామున పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో బీజేపీ నుంచి ప్రస్తుత కేంద్ర మంత్రి పియూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ గెలుపొందగా.. కాంగ్రెస్ నుండి ఇమ్రాన్ ప్రతాప్‌ఘర్హి, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, శివసేన నుంచి సంజయ్ రౌత్ విజయం సాధించారు. కాగా ఈ ఫలితాలు రాష్ట్రంలో రాబోయే MLC, పౌర ఎన్నికలపై ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
